భర్త నుంచి విడాకులు.. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..

9 Jun, 2022 14:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆకివీడు(పశ్చిమ గోదావరి): భర్త నుంచి కోర్టులో విడాకులు తీసుకుని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోమని కోరగా, అతను నిరాకరించడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కుప్పనపూడి గ్రామానికి చెందిన పుష్పలత అదే గ్రామానికి చెందిన ఎడమటి సతీష్‌ను ప్రేమించింది. ఇది తెలియని పెద్దలు ఆమెను భీమవరం మెంటేవారితోటకు చెందిన గెడ్డం ఏసురాజుతో గత ఏడాది అక్టోబర్‌ 28న వివాహం చేశారు.
చదవండి: ఎంతపని చేశావ్‌.. ఎంత భార్యపై కోపం ఉంటే మాత్రం..

ఆమె ప్రేమ విషయం భర్త తెలుసుకుని కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అనంతరం సతీష్‌ను పెద్దలు కలిసి పుష్పలతను పెళ్లి చేసుకోవాలని కోరగా, అతను నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన పుష్పలత ఈ నెల 3వ తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆకివీడులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. సోదరుడు మారంపూడి నరేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ భూషణం చెప్పారు.

>
మరిన్ని వార్తలు