మృతదేహాన్ని పీక్కుతున్న ఎలుకలు, చీమలు

6 May, 2021 12:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: మట్టి నుంచి వచ్చిన మానవుడు మట్టిలో కలవాల్సిందే.. కానీ, కరోనా దెబ్బకు బంధుత్వాలు, మానవత్వం మట్టిపాలు అవుతున్నాయి. కుటుంబసభ్యులు చనిపోతేనే దగ్గరుండి అంత్యక్రియల్ని జరిపించలేకపోతున్నాం. దీంతో స్మశానాల్లో, ఆస్పత్రులలో మృతదేహాల పరిస్థతి దారుణంగా తయారైంది. చీమలు, ఎలుకలు పీక్కుతింటున్నాయి. కొద్దిరోజుల  క్రితం మహారాష్ట్ర సాతారా జిల్లాలో ఫల్టాన్​ మున్సిపల్​ పరిధిలోని ఓ శ్మశాన వాటికలో.. సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తిన్న దృశ్యాలు నెటిజన్లు కంటతడి పెట్టించాయి. 

తాజాగా ఉత్తరప్రదేశ్ ఆజమ్‌ఘడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆస్పత్రి మార్చురీలో మహిళ మృతదేహాన్ని ఎలుకలు, చీమలు తినడం కలకలం రేపుతుంది. ఏప్రిల్‌ 29న రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ తీవ్రంగా గాయపడింది. అత్యవసర చికిత్స కోసం స్థానికులు బల్రాంపూర్‌ మండల ఆస్పత్రికి తరలించారు.  వైద్యపరిక్షలు నిర్వహించి ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్‌ అందిస్తుండగా.. మరుసటి రోజే ఆమె మరణించింది.

దీంతో ఆమె మరణంపై కుటుంబసభ్యులకు సమాచారం అందించాలని వైద్యులు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. కానీ, 4 రోజుల తర్వాత పోలీసులు, డాక్టర్ల నిర్లక్క్ష్యంతో మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చీమలు, ఎలుకలు తిన్నాయి. ఈ దారుణం వెలుగులోకి రావడంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఏకే మిశ్రా అప్రమత్తమయ్యారు. గుర్తుతెలియని మహిళ మృతదేహానికి పోస్ట్‌ మార్టం నిర్వహించేందుకు సిద్ధమైనట‍్లు తెలిపారు. మృతదేహాన్ని ఎలుకలు తిన్న ఘటనలో బాధ్యులైన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన‍్నారు. 

మరిన్ని వార్తలు