కవలలకు జన్మనిచ్చి అనంత లోకాలకు..

18 Jul, 2021 08:01 IST|Sakshi

సాక్షి,చిత్తూరు రూరల్‌: కవలలకు జన్మనిచ్చి ఓ బాలింత శుక్రవారం రాత్రి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం..పూతలపట్టు మండలం వడ్డెపల్లెకు చెందిన కుమారస్వామి భా ర్య అనిత (21)కు పురిటినొప్పు లు రావడంతో ఈ నెల 14న చి త్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. 15న డాక్టర్లు ఆపరేషన్‌ చేయడంతో ఆమె మగ కవలలకు జన్మనిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆమెకు శ్వాస సరిగా ఆడలేదు. సాయంత్రం హుటాహుటిన అంబులెన్స్‌లో చీలా పల్లె సీఎంసీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

భూమి తాకట్టు..నగదు కాజేయడంలో కనికట్టు! 
యాదమరి: భూమి తాకట్టు పెట్టుకుని నగదు ఇస్తామంటూ మోసం చేస్తున్న ముఠాను యాదమరి పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు వెస్ట్‌ సీఐ శ్రీనివాసుల రెడ్డి కథనం.. గతవారం మండలంలోని చెన్నై– బెంగళూరు జాతీయ రహదారిలోని వరిగపల్లె వద్ద కృష్టా జిల్లావాసి సూర్యనారాయణ ను తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ (31), అయ్యప్పన్‌ (35), దినకరన్‌(20),సయ్యద్‌ ఆలీ(30) కలిశారు. అతని భూమిని తాకట్టు పెట్టుకుంటా మని రికార్డులు, స్టాంపు కాగితాల రాసుకుని రూ.10 లక్షలు ఇచ్చారు.

అయితే ఈ సొమ్మును కొట్టేయాలని ముందుగానే వేసిన స్కెచ్‌ మేరకు వారి తాలూకు మనుషులు కొందరు నకిలీ పోలీసుల గెటప్‌లో వచ్చి సూర్యనారాయణను బెదిరించి నగదుతో ఉడాయించారు. దీంతో బాధితుడు యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి మండల సరిహద్దులో ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. టవేరా వాహనం తమిళనాడు వైపు మళ్లడంతో అనుమానించి అందులోని వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సూర్యనారాయణను మోసం చేసి డబ్బు కొట్టేసింది వీరేనని తేలింది. దీంతో వాహనాన్ని సీజ్‌ చేసి నిందితుల నుంచి రూ.2.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.    

మరిన్ని వార్తలు