ప్రేమ పేరుతో గర్భవతిని చేసి.. చెకప్‌ పేరుతో అబార్షన్‌

6 May, 2022 12:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడెం మండలంలోని ఖుదాబక్షుపల్లికి చెందిన బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అదే గ్రామానికి చెందిన తిరుసంగి శ్రవణ్‌ గర్భవతిని చేశాడు. ఐదు రోజుల క్రితం బాలికను చెకప్‌ పేరుతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లిన శ్రవణ్‌ తన తల్లి సహాయంతో అబార్షన్‌ చేయించాడు.

ఆ తర్వాత ఇంటికి వచ్చిన బాలిక జ్వరంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు అసలు విషయం చెప్పాడు. దీంతో బాలిక తల్లి రంగమ్మ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి పంపించారు.  

చదవండి: (వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నాతోనూ ఉంటానన్నాడు.. అయితే..) 

మరిన్ని వార్తలు