పదహారేళ్ల బాలికపై లైంగికదాడి

29 May, 2021 09:01 IST|Sakshi

బరంపురం: గంజాం జిల్లాలోని బుగడా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న కొందపతరా గ్రామానికి చెందిన పదహారేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన అక్షయ మజ్జి(26) లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్ట్‌ చేసి, జైలుకి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల 19వ తేదీన గ్రామంలో బాలిక కనిపించకపోవడంపై బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఈ నెల 22వ తేదీన బాలికతో పాటు బైక్‌పై వస్తున్న అక్షయ మజ్జిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తొలుత బుగడా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ఎంకేసీజీ మెడికల్‌కి తరలించారు. ఈ క్రమంలో ఆ బాలికపై సదరు యువకుడు లైంగికదాడికి పాల్పడినట్లు నిర్ధారణ కాగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, జైలుకి తరలించినట్లు సమాచారం. బాలికని బైక్‌పై తీసుకువెళ్లి, నిర్మానుష్య ప్రదేశంలో యువకుడు లైంగిక దాడి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు