ఈనెల 11న నిశ్చితార్థం.. ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని..

15 May, 2022 13:17 IST|Sakshi

సాక్షి,జగిత్యాల: వివాహం ఇష్టంలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం రాపల్లె గ్రామానికి చెందిన కండె సతీశ్‌ (25) మంచిర్యాలలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. సమీప గ్రామానికి చెందిన ఓ యువతితో ఈనెల 11న పెళ్లి నిశ్చితార్థం జరిగింది. ఈనెల 25న వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. అయితే.. పెళ్లి ఇష్టం లేదని చెప్పిన యువకుడు.. పెట్రోల్‌ బంక్‌లో విధులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఈనెల 12న బయటకు వచ్చాడు. శుక్రవారం జగిత్యాల కొత్త బస్టాండ్‌లోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఉన్నాడు.

శనివారం ఉదయం గది తలుపు తీయలేదు. సిబ్బంది కిటికీలోంచి చూడగా సతీశ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. నిర్వాహకులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వద్ద లభించిన ఆధారాల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కిశోర్‌ తెలిపారు. కొడుకు పెళ్లి జరగబోతోందని ఎంతో ఆనందంగా ఉన్న తల్లితండ్రులు కొడుకు మృతదేహాన్ని చూసి రోదించడం కలచివేసింది. 
చదవండి: మంత్రి కొడుకుపై లైంగిక దాడి కేసు.. పోలీసులు వచ్చేసరికి.. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు