నేడు యథావిధిగా స్పందన

13 Mar, 2023 14:18 IST|Sakshi

అమలాపురం రూరల్‌: జిల్లా, డివిజన్‌ మండల, గ్రామ స్థాయిలలో స్పందన కార్యక్రమాలు సోమవారం యథావిధిగా జరుగుతాయని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో స్పందన హాలులోజిల్లా స్థాయిలోను, డివిజన్‌, మండల కార్యాలయాల్లో, గ్రామ, వార్డు సచివాలయాలలో అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. అధికారులు అందరూ ఉదయం 10 గంటల నుంచే ఫిర్యాదులను స్వీకరిస్తారని గ్రామ వార్డు సచివాలయాల్లో మాత్రం మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య విజ్ఞాపనలు స్వీకరిస్తారని కలెక్టర్‌ తెలిపారు.

రత్నగిరి చేరిన కంచి పీఠాధిపతి

అన్నవరం: కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఆదివారం రాత్రి రత్నగిరికి చేరుకున్నారు. ఆయనకు రత్నగిరి టోల్‌గేట్‌ వద్ద దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌, వేద పండితులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం స్వామీజీ సత్యదేవుని దర్శించి, ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామీజీ ఈ నెల 18 వరకూ దేవస్థానంలో బస చేస్తారు. పీఠం సంప్రదాయాన్ని అనుసరించి కొండ దిగువన పంపా సత్రంలో ప్రతి రోజూ ఉదయం చంద్రమౌళీశ్వరునికి అభిషేకా లు, మహాత్రిపురసుందరి అమ్మవారికి పూజలు, మ ధ్యాహ్నం చంద్రమౌళీశ్వరార్చన నిర్వహిస్తారు. పూజల అనంతరం భక్తులకు స్వామీజీ దర్శనమిస్తారు.

రైల్వే స్టేషన్‌లో త్వరలో 6వ నంబర్‌ ప్లాట్‌ఫాం

ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

రాజమహేంద్రవరం రూరల్‌: నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ చీఫ్‌ విప్‌, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఆదివారం మీడియాకు ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం 4, 5 ప్లాట్‌ఫాంల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రానున్న మరో రెండు వారాల్లో తూర్పు రైల్వే స్టేషను వైపు ఆరో నంబర్‌ ప్లాట్‌ఫాం కూడా రాబోతోందని చెప్పా రు. గౌతమీ, గోదావరి వంటి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ ప్లాట్‌ఫాం పైకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు