మా హీరో మృతి బాధాకరం

12 Nov, 2023 02:52 IST|Sakshi

మా సిరిసిమువ్వ హీరో మృతి చెందటం బాధగా ఉంది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో చంద్రమోహన్‌ నా స్నేహితుల ఇళ్లలోనే మకాం ఉండేవారు. షూటింగ్‌లో చాలా సరదాగా పాల్గొనేవారు. పదహారేళ్ల వయసు సినిమా షూటింగ్‌ కూడా చాలా వరకూ ఈ ప్రాంతంలోనే జరిగింది. దీంతో చంద్రమోహన్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది.

– ఉజూరి వీర్రాజు, సినీ నిర్మాత, రామచంద్రపురం

మంచి వ్యక్తిత్వం

చంద్రమోహన్‌ చాలా సరదాగా ఉండేవారు. ఆ ఈజ్‌తోనే మంచి హాస్యనటుడిగా ఎదిగారు. తన దగ్గర ఎవ్వరి డబ్బులూ ఉంచుకునేవారు కాదు. తనకు రావాల్సిన ఒక్క రూపాయి కూడా వదిలేవారు కాదు. మన కష్టానికి ప్రతిఫలం తీసుకోకుండా ఉండకూడదని చెప్పేవారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

– శ్రీపాద జిత్‌మోహన్‌ మిత్రా, సీనియర్‌ సినీ ఆర్టిస్టు, రాజమహేంద్రవరం

మరిన్ని వార్తలు