మది నిండుగా.. వెలుగుల పండగ | Sakshi
Sakshi News home page

మది నిండుగా.. వెలుగుల పండగ

Published Sun, Nov 12 2023 2:52 AM

- - Sakshi

అమలాపురం టౌన్‌: చీకటిని పారదోలుతూ వెలుగులు నింపే దీపావళి పండగను ఆనందోత్సాహాలతో నిర్వహించేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. దీంతో వాడవాడలా సందడి మొదలైంది. దాదాపు అన్నిగ్రామాల్లోనూ బాణసంచా దుకాణలను ఏర్పాటు చేశారు. మరో పక్క ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో బాణసంచా దుకాణాలకు అనుమతులు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించింది. అయితే దీపాల పండగలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేటుచేసుకున్నా ప్రమాదమే. దీంతో అధికారులను అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

424 దుకాణాలకు అనుమతి

జిల్లాలో ఆరు అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, రాజోలు, రామచంద్రపరం, మండపేటలోని ఈ కేంద్రాల ద్వారా జిల్లాలో 424 బాణసంచా దుకాణాలకు అనుమతి ఇచ్చారు. అమలాపురం అగ్నిమాపక కేంద్రం పరిఽధిలో 98, ముమ్మిడివరం పరిఽధిలో 62, కొత్తపేట పరిధిలో 89, రాజోలు పరిధిలో 78, రామచంద్రపురం పరిధిలో 41, మండపేట పరిధిలో 56 దుకాణాలు ఉన్నాయి.

కాల్‌ సెంటర్ల ఏర్పాటు

దీపావళి సందర్భంగా జిల్లాలో ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే, అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆరు అగ్నిమాపక కేంద్రాల్లో వీటిని నెలకొల్పారు. అత్యవసరమైనప్పుడు 101 ఫైర్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఆయా కేంద్రాల అగ్నిమాపక అధికారుల సెల్‌ఫోన్‌ నంబర్లు, ల్యాండ్‌ లైన్‌ నంబర్లు అందుబాటులో ఉంచారు. జిల్లాలోని ఆరు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో అధికారులు దీపావళి నాడు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సి జాగ్రత్తలపై పోస్టర్లు ముద్రించి, వాటిని ప్రజలకు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు.

దీపావళికి సర్వం సిద్ధం

జిల్లాలో 424 బాణసంచా

దుకాణాలకు అనుమతి

ఆరు ఫైర్‌ స్టేషన్ల పరిధిలో

ప్రత్యేక కాల్‌ సెంటర్లు

అధికారుల అప్రమత్తం

అన్ని చర్యలూ తీసుకున్నాం

జిల్లాలో అనుమతులు ఇచ్చిన 424 బాణసంచా దుకాణాల వద్ద ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకున్నాం. అవుట్‌ పోస్టులు ఏర్పాటు చేశాం. కాల్‌ సెంటర్లు నిర్వహిస్తున్నాం. దుకాణాల సముదాయాల వద్ద ఫైర్‌ ఇంజిన్లు, మంటలను అదుపు చేసే అగ్నిమాపక పరికరాలు, నీటి నిల్వలు సిద్ధంగా ఉంచాం. ప్రజలు కూడా దీపావళిని జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్తగా జరుపుకోవాలి.

– ఎన్‌.పార్థసారథి, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి

అత్యవసర నంబర్లు

అగ్నిమాపక కేంద్రం మొబైల్‌ ల్యాండ్‌లైన్‌

అమలాపురం 99637 27665 08856–231101

ముమ్మిడివరం 99637 28285 08856–271101

కొత్తపేట 99637 28051 08855–243299

రాజోలు 79951 88422 08862–221101

రామచంద్రపురం 99637 27545 08857–242401

మండపేట 99637 27741 08855–232101

1/1

Advertisement
Advertisement