హాల్‌టికెట్ల జారీలో ఇబ్బందులుంటే చెప్పండి

7 Mar, 2023 01:04 IST|Sakshi

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఈనెల 15 నుంచి జరుగనున్న ఇంటర్‌ థియరీ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు హాల్‌టికెట్ల జారీలో ఇబ్బందులుంటే ఫిర్యాదు చేయాలని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖరబాబు సూచించారు. ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు వెంటనే హాల్‌టికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. హాల్‌టికెట్ల జారీలో కళాశాలల యాజమాన్యాలు ఇ బ్బందికి గురిచేస్తే పబ్లిక్‌ పరీక్షల కోసం ఏ ర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 08812 230197 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

ప్రాక్టికల్స్‌కు 5,118 మంది హాజరు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు సోమవారం 5,118 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్‌ విద్యార్థులకు సైన్స్‌ సబ్జెక్టులో జరిగిన పరీక్షకు 73 కేంద్రాల్లో 4,510 మందికి 4,434 మంది హాజరయ్యారు. అలాగే 19 కేంద్రాల్లో ఒకేషనల్‌ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షకు 793 మందికి 684 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖర బాబు తెలిపారు.

మరిన్ని వార్తలు