రోడ్డు ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

Published Wed, Nov 22 2023 1:48 AM

- - Sakshi

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఏలూరు జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్‌ డివిజన్ల పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ, రాష్ట్ర రహదారుల్లో బ్లాక్‌స్పాట్స్‌, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుపై సూచనలు చేశారు. రోడ్డు సేఫ్టీ, ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ, పోలీస్‌ తదితర ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో జాతీయ రహదారులపై బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద రేడియం స్టిక్కర్లతో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని జాతీయ రహదారులపై గుర్తించిన బ్లాక్‌ స్పాట్స్‌తో పాటు అప్రోచ్‌ రోడ్లపై ప్రమాద హెచ్చరిక బోర్డులు, క్యాట్‌ఐస్‌లు ఏర్పాటు చేయాలని, ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. రాత్రివేళల్లో వాహనదారులకు ఫేస్‌వాష్‌ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. నిర్ణీత సమయాల్లో హైవేపై ఉన్న దాబాలను మూయించాలన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో నిత్యం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించాలని, వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో ఎస్‌బీ సీఐ వి.ఆదిప్రసాద్‌, డీసీఆర్‌బీ సీఐ ఎం సుబ్బారావు, డీటీఆర్‌బీ ఎస్సై రాంబాబు ఉన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఎస్పీ మేరీ ప్రశాంతి, హాజరైన పోలీస్‌ అధికారులు
1/1

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఎస్పీ మేరీ ప్రశాంతి, హాజరైన పోలీస్‌ అధికారులు

Advertisement
Advertisement