Frizzell D'Souza: ఆర్కిటెక్ట్‌ జాబ్‌ వదిలి మ్యూజిక్‌ ఇండస్ట్రీలో రాణిస్తున్న డిసోజా

27 Oct, 2023 10:43 IST|Sakshi

బెంగళూరుకు చెందిన సింగర్, సాంగ్‌ రైటర్‌ ఫ్రిజెల్‌ డిసోజా. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో రకరకాల పాటల గురించి పోస్ట్‌లు, వీడియోలు పెట్టడం ద్వారా ఇండియన్‌ ఇండీ మ్యూజిక్‌ ప్రపంచంలోకి వచ్చింది. లాక్‌డౌన్‌ కాలంలో ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు ‘సమ్‌థింగ్‌ న్యూ’ పాట ఐడియా వచ్చింది. ఈ డెబ్యూ సాంగ్‌ ద్వారా డిసోజా మెలోడియస్‌ వాయిస్‌కు మంచి పేరు వచ్చింది. 

సోషల్‌ మీడియాలో కనిపించి, వినిపించే డిసోజా లైవ్‌ ప్రోగ్రామ్స్‌లో కూడా పాల్గొంది. ఫస్ట్‌ టూర్‌లో వచ్చిన పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఆమెకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ఇక రచన విషయానికి వస్తే...లవ్, హార్ట్‌బ్రేక్‌కు సంబంధించిన అంశాలపై పాటలు రాయడం డిసోజాకు ఇష్టం.‘వ్యక్తిగత అనుభవాల నుంచి చూసిన, విన్న విషయాల ఆధారంగా పాటలు రాయడం నాకు సులభం’ అంటుంది.

మొదట్లో తన పాటల్లో ఎలక్ట్రిక్‌ గిటార్, డ్రమ్‌ల శబ్దం లిరిక్స్‌ను డామినేట్‌ చేసేది. ఇప్పుడు మాత్రం లిరిక్స్‌ కూడా స్పష్టంగా వినబడే ఈజీ–టు–లిజెన్‌ వైబ్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్‌ అయిన డిసోజా ఫుల్‌–టైమ్‌ మ్యూజిషియన్‌గా ఉండడమే తనకు ఇష్టం అంటుంది.

A post shared by Frizzell D'Souza (@frizzell.dsouza)

A post shared by Frizzell D'Souza (@frizzell.dsouza)

మరిన్ని వార్తలు