అందమైన కనుబొమ్మలకు కలోంజీ!

21 Oct, 2023 16:00 IST|Sakshi

నల్ల జీలకర్ర (కలోంజీ) విత్తనాలను పొడిచేయాలి. ఈ  పొడిలో ఆలివ్‌ ఆయిల్, అలోవెరా జెల్‌ను వేసి చక్కగా కలపాలి. ఇప్పుడు తడి కాటన్‌ వస్త్రంతో కనుబొమ్మలను శుభ్రంగా తుడిచి.. నల్ల జీలకర్ర మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి. కనుబొమ్మలను తడిలేకుండా తుడిచి కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ను కనుబొమ్మలపైన రాసి ఐదునిమిషాల పాటు మర్దన చేయాలి.

ఈ ప్యాక్‌ వల్ల కలిగే ప్రయోజనాలు..

  • ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేయడం వల్ల రక్తప్రసరణ చక్కగా జరిగి కనుబొమల మీద వెంట్రుకలు పెరుగుతాయి.
  • నల్లజీలకర్ర ప్యాక్‌ పలుచటి కనుబొమలను ఒత్తుగా మారుస్తుంది. కనుబొమలు తీరైన ఆకృతిలో చక్కగా మెరుస్తాయి.
  • కలోంజిలోని ΄ోషకాలు కనుబొమల వెంట్రుకలు రాలకుండా చేస్తాయి.
  • కనుబొమలు తెల్లబడడం మొదలైన వారు సైతం ఈ ΄్యాక్‌ను వాడితే వెంట్రుకలు నల్లగా మారతాయి.

(చదవండి: తవ్వకాల్లో బయటపడిన రెండు వేల ఏళ్ల నాటి బ్యూటీ పార్లర్‌!)

మరిన్ని వార్తలు