ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైన చేప! చూస్తే భయపడాల్సిందే!

1 Dec, 2023 15:50 IST|Sakshi

ఇటీవల కుక్కలు, పిల్లుల్లో అసహ్యమైన వాటిని గుర్తించి అవే ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైనవిగా పేర్కొనడం గురించి విన్నాం. ఐతే ఇలా వెల్లడించేది అగ్లీ యానిమల్‌ ప్రిజర్వేషన్‌ సోసైటీ. ఇపుడు ఆ కోవలోకి ఓ చేప వచ్చింది. ఇదేంటి చేపల్లో కూడా అసహ్యమైనవి ఉంటాయా! అని ఆశ్చర్యంగా ఉంది కదూ!. ఔను ఓ వికారమైన చేప ఉందంటా. దీన్ని చూస్తేనే భయపడతామని చెబుతున్నారు పరిశోధకులు.

ఈ చేప పేరు 2003లో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అయ్యింది. కానీ ఇది రియల్‌ కాదనే అనుకున్నారు అంతా. ఐతే అలాంటి వింత చేప ఉందని, అదే అత్యంత అసమస్యమైనదని శాస్త్రవేత్తలు చెప్పడం విశేషం. ఈ చేప ఆకారం పలు ఎమోజీల్లో కూడా ఉంటుంది. అయితే ఈ అత్యంత అసహ్యకరమైన చేపను తొలిసారిగా 1983లో న్యూజిలాండ్‌ తీరంలో ఓ పరిశోధన నౌక దీన్ని కనుగొంది. ఇవి సముద్రంలో సుమారు 600 నుంచి 1200 మీటర్ల అడుగుల లోతుల్లో సంచరిస్తుంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. పీడనం అధికంగా ఉండే అడుగున ఇవి ఉండటం కారణంగా వీటి ఎముకలు, కండరాలతో కూడిన మెత్తని శరీరంతో చూసేందుకు వికారంగా ఉంటాయన్నారు.

శాస్త్రవేత్తలు  దీన్ని బ్లాబ్‌ ఫిష్‌ అని పిలుస్తారు. ఇది సైక్రోల్యూట్స్ మైక్రోపోరోస్ కుటుంబానికి చెందడం వల్ల దీని శాస్త్రీయ నామం కూడా అలానే(సైక్రోల్యూట్స్ మైక్రోపోరోస్) వ్యవహరించారు పరిశోధకులు. అయితే దీన్ని బయటకు తీస్తే ఒత్తడి తక్కువుగా ఉండటం వల్ల దీని శరీరం విస్తరించినట్లుగా అయ్యి రిలాక్స్‌డ్‌ మోడ్‌లో ఉండి ముక్కు బయటకు వచ్చి ఉంటుంది. అదే సముద్రం అడుగున మాత్రం అధిక పీడనం కారణంగా అది మొత్తం ముడిచుకుపోయినట్లు ఓ జెల్లీ ఫిష్‌ మాదిరిగా కనిపిస్తుందిన చెప్పుకొచ్చారు. అయితే దీన్ని చూసిన వెంటనే..దాని వింత ఆకరం కారణంగా భయపడటం జరుగుతుందని అన్నారు. అందువల్లే అగ్లీ యానిమల్ ప్రిజర్వేషన్ సొసైటీ దీన్ని ప్రంపచంలోనే అత్యంత వికారమైన బ్లాబ్‌ ఫిష్‌గా పేర్కొన్నట్లు తెలిపారు. 

(చదవండి: బిడ్డను ఎప్పుడెప్పుడూ చూస్తానా అనుకుంది! కానీ అదే ఆమెకు..)

మరిన్ని వార్తలు