Cabbage Egg Bhurji Recipe: క్యాబేజ్‌తో ఎగ్‌ భుర్జి.. ఎప్పుడైనా ట్రై చేశారా? చపాతీలో బావుంటుంది

1 Dec, 2023 11:00 IST|Sakshi

క్యాబేజ్‌ ఎగ్‌  భుర్జి తయారీకి కావల్సినవి

క్యాబేజీ తురుము – రెండు కప్పులు; నూనె – మూడు టేబుల్‌ స్పూన్లు;
ఉల్లిపాయ తరుగు – అరకప్పు; అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర టీస్పూన్లు;
పచ్చిమిర్చి – చిన్నవి ఆరు(సన్నగా తరగాలి); ధనియాల పొడి – అరటీస్పూను;
పసుపు – అరటీస్పూను; కారం – ముప్పావు టీస్పూను; గుడ్లు – నాలుగు;
ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు. 

తయారీ విధానమిలా:
స్టవ్‌ మీద మందపాటి బాణలి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి.  ఉల్లిపాయ వేగాక, అల్లం వెల్లుల్లి పేస్టువేసి వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తరువాత పచ్చిమిర్చి తరుగు వేయాలి. మిర్చి వేగిన తరువాత ధనియాల పొడి, కారం, పసుపు, క్యాబేజీ తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి బాణలి మీద మూతపెట్టి సన్న మంట మీద మగ్గనివ్వాలి.
గుడ్లసొనను ఒక గిన్నెలో వేసి బీటర్‌ లేదా ఫోర్క్‌తో కలిపి పక్కన పెట్టాలి. ∙క్యాబేజీ ఉడికి దగ్గర పడుతున్నప్పుడు గుడ్ల సొనవేసి కలుపుతూ వేయించాలి.
చక్కగా వేగిన తర్వాత కొత్తిమీర చల్లుకుని దించేయాలి. ∙రోస్టెడ్‌ బ్రెడ్, చపాతీ, రోటీలోకి ఇది మంచి సైడ్‌ డిష్‌.  

మరిన్ని వార్తలు