జర్నీలో వాంతులు, వికారం రాకుండా ఉండాలంటే..ఇలా చేయండి!

5 Aug, 2023 11:22 IST|Sakshi

కొంతమందికి బస్సులో లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వికారంగా అనిపించడంతోపాటు తలనొప్పి, వాంతులు వస్తాయి. ఇలాంటి పరిస్థితిని మోషన్‌ సిక్‌నెస్‌ అంటారు. ఇది రాకుండా ఉండాలంటే లాంగ్‌ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు టీ, కాఫీల వంటివి తాగకూడదు. అలాగే ఖాళీ కడుపుతో కూడా ఉండకూడదు. సులభంగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారాలని తీసుకోవాలి. నోటిలో ఒకటి రెండు యాలకులు పెట్టుకోవాలి. ఇది వికారం సమస్యని తొలగిస్తుంది.

ప్రయాణం చేసేరోజు ఖాళీ కడుపుతో అర టీస్పూన్‌ నల్ల ఉప్పు, నిమ్మకాయ రసం, తేనె కలిపి తాగితే గ్యాస్‌కు సంబంధించిన సమస్యలు దరిచేరవు. ప్రయాణంలో నిమ్మ, నారింజ వంటి సిట్రస్‌ పండ్లను తింటూ ఉండాలి. అరగ్లాసు నీటిలో చెంచాడు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ కలిపి పరగడుపున తాగితే వాంతులు రావు. కిస్మిస్‌లలో జింక్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. రాత్రిపూట కొన్ని కిస్మిస్‌లను తీసుకుని తినాలి.

దీంతో మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. దీంతో పైల్స్‌ సమస్య నుంచి బయట పడవచ్చు. రాత్రిపూట కిస్మిస్‌లను నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం తిన్నా సమస్య నుంచి బయటపడచ్చు..ఒకటి రెండు జామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి హెర్బల్‌ టీ మాదిరిగా తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలు, స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులు రాకుండా ఉంటాయి. షుగర్‌ లెవెల్స్‌ అదుపులో ఉంటాయి. చర్మం కాంతిమంతంగా... మృదువుగా తయారవుతుంది.  

(చదవండి: అప్పుడే జుట్టు తెల్లబడుతుందా! ఇలా చేసి చూడండి!)

మరిన్ని వార్తలు