Green Tea Side Effects: మీకు తెలుసా?అలాంటి వారు గ్రీన్‌ టీ తీసుకోకపోవడమే మంచిది

9 Sep, 2023 14:40 IST|Sakshi

బరువు తగ్గాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనుకునే వారు చాలామంది తమ ఆహారంలో భాగంగా గ్రీన్‌ టీ తీసుకుంటారు. ఎందుకంటే ఇది మన శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రోగ్యానికి మంచిదని అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.


గ్రీన్‌ టీ ఎక్కువగా తాగడం వల్ల కొందరిలో కాలేయ సమస్యలు వస్తాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్‌ టీ తీసుకునేటప్పుడు గర్భిణులు, పాలిచ్చే తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

► పరిశోధనల ప్రకారం, గ్రీన్ టీలో కూడా కొద్ది మోతాదులో కెఫిన్ ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.ఒకవేళ తీసుకోవాల్సి వస్తే, రోజుకు 200 మిల్లీగ్రాములకు మించి కెఫిన్ తీసుకోకూడదని పరిశోధనలు సూచిస్తున్నాయి. 

► గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ దండిగానే ఉంటుంది. ఒకరకంగా ఇది హెల్తీ డ్రింక్ అయినప్పటికీ, గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో గ్రీన్ టీ తీసుకోకూడదని అరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

► గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో గ్రీన్ టీకి దూరంగా ఉండటం మంచిది. మూడవ త్రైమాసికంలో గ్రీన్ టీని తీసుకోవచ్చు. మరోవైపు కాఫీని అస్సలు తీసుకోకూడదు, ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది.

► గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీకి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. లేకుంటే ఇది పాల స్రావాన్ని తగ్గిస్తుంది.  కాలేయ వ్యాధులు ఉన్నవారు గ్రీన్‌ టీ తీసుకోకపోవడమే మంచిది. గ్రీన్‌ టీ తాగేవారికి ఇతర మందులతో రియాక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది.

► అందువల్ల మీరు ఇప్పటికే ఏవైనా ఇతర మందులు వాడుతున్నట్లయితే ఒకసారి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. గ్రీన్‌ టీ అధికంగా తీసుకోవటం వల్ల తలనొప్పి రావచ్చు. ఇది రక్తపోటును అమాంతం తగ్గించే అవకాశం ఉంది. ఇది అశాంతిని కలిగిస్తుంది.

► నిద్రలేమికి కారణం అవుతుంది. జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తుంది. భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది.గ్రీన్‌ టీ తీసుకున్న తర్వాత ఏవైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ గమనించినట్టయితే... మీరు వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. 

మరిన్ని వార్తలు