‘తొక్క’ లే అనుకుంటే పప్పులో కాలేసినట్టే!

22 Feb, 2024 17:06 IST|Sakshi

సౌందర్య సాధన ఉత్పత్తుల్లో బంగాళా దుంప తొక్కల వినియోగం

భాస్వరం, పొటాషియం, నత్రజని వంటి  పోషకాలున్న తొక్కలు మొక్కలకు బలం

#Potato Peel : చిన్నపుడు అమ్మమ్మ బీర కాయ పొట్టు పచ్చడి చేసి. ఇది ఏం పచ్చడో చెప్పండర్రా.. అంటూ పెద్ద పజిల్‌ వేయడం గుర్తుందా? నిజంగా అమోఘమైన ఆ రుచికి, అసలు అది ఏం పచ్చడో  అర్థం కాక.. తీరా గుట్టు విప్పాక, ‘బీర్‌’ కాయా అంటూ నోరు వెళ్లబెట్టడం కూడా తెలుసు. అలాగే సొరకాయ తొక్కులు, పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి, ఆఖరికి పుచ్చకాయల తొక్క లోపల ఉండే తెల్లటి పదార్థంతో కూడా దోసెలు చేసి పెట్టడం కూడా తెలుసు. ఇపుడు అలాంటి తొక్కలు మరొక దాని గురించే తెలిస్తే.. నిజంగా ఔరా అంటారు.. అదిఏమిటంటే..

చిన్న పిల్లలకు ఆలూ ఫ్రై చేసి పెడితే చాలు..మారు మాట్లాడకుండా లాగించేస్తారు. పెద్దలకి కూడీ ఆలూ లేదా బంగాళా దుంప అంత ఫ్యావరేట్‌. కానీ ఆలూ తొక్కల వాడకం, ప్రయోజనాల గురించి  మాత్రం చాలామంది తెలియదు. బంగాళాదుంపల తొక్కల్లో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.  ఈ తొక్కలను చర్మ, సౌందర్య సాధానాల్లో వినియోగిస్తారు.

కాలిన గాయాలకు చికిత్స
ఆలుగడ్డ తొక్కల్లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ ఉంటుంది. ఇది చిన్నపాటి కాలిన గాయాలకు చికిత్సగా ఉపయోపడుతుంది. అంతేకాదు వేసవిలో ఎండలకు కమిలిని చర్మానికి  సహజమైన  చిట్కాగా పని చేస్తుంది.

సిల్కీ స్కిన్‌
మొటిమలతో ఎక్కువగా బాధపడుతున్నవారు ఆలూ తొక్కలను అప్లై చేసుకోవచ్చు.మొటిమల్ని గిల్లకుండా, ఎక్కువ  రుద్దకుండా వాటిపై తొక్కలతో మెల్లిగా రాయాలి. అలాగే కళ్లకిందే ఉండే  డార్క్ సర్కిల్స్‌  నివారణలో కూడా  ఫలితాలు అందిస్తుంది. కెమికల్స్ లేని సహజమైన ఈ తొక్కల రసాన్ని చర్మానికి అప్పై చేయవచ్చు.  ఈ జ్యూస్‌తో సిల్కీగా, ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అందుకే వీటిని ఎప్పటినుంచో సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు.  ఐరన్ పాత్రల తుప్పు పట్టకుండా, స్టార్చ్ సహజమైన గ్రీజుగా పనిచేస్తుంది. అలా వంట ఇంటి చిట్కాగా పనిచేస్తుంది.

ఆలూ తొక్కలు మొక్కలకు ఎంతో బలం
మొక్కలకు కూడా ఇవి మంచి బాలన్నిస్తాయి. భాస్వరం, పొటాషియం, నత్రజని వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన ఈ తొక్కలు నేల నాణ్యతను మెరుగుపరుస్తాయి. మొక్కల ఎదుగుదల బాగా ఉంటుంది.  ఆలూ తొక్కల పీల్‌ కంపోస్ట్‌ వేసిన వెంటనే  గులాబీ, మల్లె లాంటి పూల మొక్కలు వెంటనే మొగ్గ తొడుగుతాయి.  

whatsapp channel

మరిన్ని వార్తలు