మొక్కలు సరిగా ఎదగడం లేదా? ఈ టిప్స్‌ ట్రై చేయండి! | Sakshi
Sakshi News home page

మొక్కలు సరిగా ఎదగడం లేదా? ఈ టిప్స్‌ ట్రై చేయండి!

Published Sat, Feb 3 2024 1:16 PM

do you know these super tips to help boost your garden - Sakshi

ఇంటి కుండీలలో లేదా పెరటి తోటల్లో పెంచే మొక్కలు ఒక్కొక్కసారి ఎండి పోతుంటాయి.  ఎండిన చెట్టు చిగురించాలంటే కొన్ని టిప్స్‌ ఫాలో అవ్వాలి. అసలు చెట్లు ఎందుకు ఎండిపోవడానికి నీరు లేక, మరే ఇతర కారణమా అనేది గుర్తించాలి. నీరు తక్కువైనప్పుడే కాదు.. నీరు ఎక్కువగా ఉన్నా చెట్లు ఎండిపోతుంటాయి. కాబట్టి, అలా లేకుండా చూడండి. త్వరలో వసంత రుతువు రాబోతోంది. మీ పెరటి తోటలో లేదా ఇంటి కుండీలలో ఉన్న చెట్లను సంరక్షించుకోవడం ఇప్పటినుంచే ఆరంభిస్తేనే కదా అప్పటికి చక్కగా చిగిర్చి పూలు పూసేది! ఇంకెందుకాలస్యం? చూసేద్దామా మరి!
 

మొక్కలకు జీవకళ
మొక్కలు సాధారణంగా పురుగుల కారణంగా అనేక తెగుళ్ళ బారిన పడుతుంటాయి. అప్పుడు ఎండి, వాడిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు వాటిని కాపాడుకోవాలి. ఆకులపై దుమ్ము, ధూళి పేరుకుపోయినా అవి కళ తప్పుతాయి. అందువల్ల వాటిని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇందుకు చిన్న పాటి పైపు లేదా స్ప్రేయర్‌ ఉపయోగపడుతుంది. 

సూర్యకాంతి...
చెట్లకి సరైన కాంతి అవసరం. అలాగని మరీ ఎండలో కూడా ఉంచరాదు. లేదా బాగా  చీకటి ఉన్న ప్రదేశంలో ఉంచడమూ సరికాదు. ఎండ పొడ పడే ప్రదేశంలోనే కుండీలని ఉంచాలి లేదా చెట్లని పెంచాలి.

కుండీల పరిమాణం...
కుండీలో పెంచే మొక్క తీరును బట్టే కుండీని ఎంచుకోవాలి. చెట్ల కుండీలు అవి పెరగడానికి సరిపడనంత లేకుండా చిన్నగా ఉన్నా చెట్లు ఎండిపోవడానికి కారణమవుతాయి. కాబట్టి, సరైన పరిమాణంలో ఉన్న కుండీల్లో పెంచడం మేలు. 

మొక్కలని శుభ్రం చేయడం...
దెబ్బతిన్న, ఎండిన, పండిన ఆకులని ఎప్పటికప్పుడు తుంచి శుభ్రం చేయాలి. వీటిని కత్తెరతో కత్తిరించడం మంచిది. తెగులు సోకిన కొమ్మలను, ఆకులని తుంచడం వల్ల మొక్కలు చక్కగా పెరుగుతాయి.  

ఎరువులు...
ఎరువు లేకుండా పెంచడం వల్ల చెట్లు నిస్తేజంగా... సారం లేనట్లు... వడలిపోయినట్లు కనిపిస్తాయి. అందువల్ల వాటికి అప్పుడప్పుడు ఎరువులు వేయాలి. అప్పుడే మొక్కలు చక్కగా పెరుగుతాయి. వీలయినంత వరకు రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులను వాడటం మంచిది. బియ్యం, పప్పులు కడిగిన నీళ్లని పోయడం, ఉల్లిపొట్టు, కూరగాయల తొక్కలు వంటి వంటింటి వ్యర్థాలతో ఎరువులు తయారు చేసే ఉపకరణాలు ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వాటి సాయం తో తయారు చేసిన ఎరువులు వాడటం వల్ల వాటికే కాదు, అవి తినే మన ఆరోగ్యానికి కూడా మంచిది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement