Sakshi News home page

పైనాపిల్‌ మంచిదని తినేస్తున్నారా? అతిగా తింటే సమస్యలు తప్పవు!

Published Tue, Feb 20 2024 1:32 PM

Eating Pineapple Benefits Nutrition Value Side Effect - Sakshi

పైనాపిల్‌ అంటే అందరూ ఇష్టంగా తినరు. ఎందుకంటే అది తినంగానే నోటిలో ఏదో దురదగా అనిపిస్తుంది. కాస్త పులుపు, తీపి కలయికతో కూడిన ఒక విధమైన రుచితో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ వంటి మూడు దేశాలు ప్రముఖంగా ఈ పండుని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని సలాడ్‌లు, కాక్‌ టెయిల్‌ లేదా డిజార్ట్‌ల రూపంలో చాలామంది తీసుకంటుంటారు. అయితే ఈ పండుని తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధులకు చెక్‌పెట్టడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అలానే అతిగా తింటే అంతే స్థాయిలో సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

పైనాపిల్‌ తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో న్యూట్రిషన్‌ అండ్‌ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమయ్యింది. ఇది అందించే ప్రయోజనాలను చూసి నిపుణులే ఆశ్చర్యపోయారు. పైగా బరువువ తగ్గాలనే వారికి ఈ పండు గొప్ప వరమని చెబుతున్నారు. అదేసయంలో దీన్ని అధికంగా తీసుకుంటే జరిగే పరిణామాలను కూడా సవివరంగా వెల్లడించారు. అవేంటంటే..?

కలిగే ప్రయోజనాలు..

  • రక్తంలోని కొలెస్ట్రాల్‌ను ప్రభావితం చేసే ప్రత్యేక పోషకం బ్రోమెలైన్‌ ఉంది. ఇది కొలెస్ట్రాల్‌ ఫలకాలను విచ్ఛిన్నం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 
  • దీని కాండంలో ఉండే ప్రోటీన్‌  జీర్ణ ఎంజైమ్‌ని ప్రోత్సహించి చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది. 
  • ప్రతిరోజూ పైనాపిల్‌ తింటే హైపర్‌ కొలెస్టెరోలేమియా స్థాయిలు, లిపోప్రోటీన్‌(ఎల్‌డీఎల్‌) వంటి చెడుకొలస్ట్రాల్‌లకు చెక్‌ పెడుతుంది. 
  • రోజు దీని  ఆహారంగా తీసుకునేవారికి బరువు అదుపులో ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడయ్యింది. 
  • ఇందులో ఉండే ఫైబర్‌, పోటాషియం, విటమిన్‌ సీ కంటెంట్లు గుండె ఆరోగ్యానికి మంచివి
  • రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 
  • విటమిన్‌ సీ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 
  • కేన్సర్, ఆర్థరైటిస్, గుండె జబ్బుల వంటి వ్యాధుల బారిన పడకుండా నియంత్రిస్తుంది. 

అతిగా తీసుకుంటే తలెత్తే పరిణామాలు..

  • వికారం, విరేచలు లేదా గుండెల్లో మంట వంటి వాటికి దారితీస్తుంది
  • ఇందులో ఉండే బ్రోమెలైన్‌ అధిక రక్తస్రావం లేదా చర్మంపై దద్దుర్లు వచ్చే అవకావం ఉంది. 
  • అలాగే రక్తం గడ్డకట్టాన్ని ప్రభావితం చేస్తుంది. 
  • పైనాపిల్‌ జ్యూస్‌గా తీసుకునేవారు పోటాషియం స్థాయిల విషయంలో జాగురకతతో ఉండాలి. ఎందుకంటే ఇది మూత్ర పిండాల సమస్య ఉన్నవారికి మరింత సమస్యత్మకంగా మారిపోతుంది. అదనంగా ఉండే పోటాషియంను బయటకు పంపడంలో మూత్రపిండాలు విఫలమై లేనిపోని సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. 
  • అలెర్జీ దద్దర్లు, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, ముఖం, నాలుకు, గొంతు నొప్పి, పెదవుల వాపు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది తదితర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
  • ఇది శరీరంలో కొలస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో ఎంత మంచిది మితంగా తీసుకోకపోతే అంత ప్రమాదం. అందువల్ల వాటిని మీ రోజూవారి ఆహారంలో ఎంతమేర తినడం బెటర్‌ అనేది న్యూట్రిషియన్లు లేదా వైద్యులను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం ఇవ్వడం జరిగింది. మీ ఆహారంలో భాగం చేసుకోవాలనుకుంటే మాత్రం నిపుణులు లేదా ప్రముఖ డైటీషియన్లను సంప్రదించి తీసుకోవడం మంచిది. 

(చదవండి: అట్లాంటిక్‌ డైట్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!)

adsolute_video_ad

Advertisement

What’s your opinion

Advertisement