How To Lower Sugar Levels: మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి? గ్లూకోజ్‌ స్థాయిలు పెరగకూడదంటే..

13 Nov, 2023 16:48 IST|Sakshi

మధుమేహం వల్ల ఎన్నో రకాల రుగ్మతల బారిన పడతాం. పైగా ఒక్కోసారి గ్లూకోజ్‌ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోవడం లేదా డౌన్‌ అయిపోయి ప్రాణాల మీదకు వచ్చే ఉదంతాలు కోకొల్లలు. అందువల్ల సాధ్యమైనంత వరకు పేషెంట్లు తగు జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని నియంత్రించుకునేలా జాగ్రత్తలు పాటించాల్సిందే. ముఖ్యంగా శరీరంలోని గ్లూకోజ్‌ లెవల్స్‌ సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. అందువల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని మదుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలంటే..!

గ్లూకోజ్‌ అనేది శరీరానికి మంచి తక్షణ శక్తి వనరు. ఇది ఉంటేనే మన శరీరం రోజు వారి కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించగలదు. ఇది సమస్థాయిలో ఉండాలంటే ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు సక్రమైన రీతీలో ఉండాలి. ఈ ఒక్క దీర్ఘకాలిక మదుమేహ వ్యాధి.. గుండె, మూత్రపిండాలు, చర్మ సంబంధిత రుగ్మతలరే దారితీస్తుంది.

అందువల్ల ముందుగానే మనం దీన్ని అదుపులో ఉంచుకోవాలి. వివిధ రుగ్మతలు బారినపడకుండా మంచి ఆహారపు శైలిని అలవరుచుకోవాలి. ముఖ్యంగా శారీరక శ్రమ, ఒత్తిడి తదితరాలు గ్లూకోజ్‌ స్థాయిలను ప్రభావితం చేసే కీలక అంశాలు. అందువల్ల శరీరంలోని గ్లూకోజ్‌ స్థాయిలు పెరగకుండా సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం అనేది అత్యం ప్రధానంజ

ఆరోగ్యకరంగా గ్లూకోజ్‌ లెవల్స్‌ ఉండాలంటే..

 • క్రమ తప్పకుండా వ్యాయామం చేయాలి. దీని వల్ల బరువు పెరగకుండా ఉండటమే కాకుండా మీలో ఉన్న శక్తి మంచిగా బర్న్‌ అవుతుంది. 
 • అలాగే రక్తపోటు, కొలస్ట్రాల్‌ స్థాయిలను కూడా మెరుగుపరిచేలా వారంలో ఒక్కరోజు అయినా సైక్లింగ్‌ లేదా ఈత వంటి వాటికి కనీసం 150 నిమిషాలు కేటాయించాలి. 
 • కండరాలు బలాన్ని పెంచడానికి బరువులు ఎత్తడం, వ్యాయామ నిపుణల పర్యవేక్షణలో అందుకు తగ్గ శిక్షణ తీసుకోవడం చేయాలి
 • ఈ వ్యాధిగ్రస్తులు వ్యాయామం చేయడానికి ముందు తదుపరి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను చెక్‌ చేయించుకోవాలి.
 • ఎలాంటి కార్బోహైడ్రేట్లు తీసుకుంటున్నామనేది కూడా ముఖ్యం
 • పండ్లు, కూరగాయాలు, చిక్కుళ్లు, వంటి ఫైబర్‌ అధికంగే ఉండే ఆహారపదార్థాలు గ్లూకోజ్‌ లెవల్స్‌ని సమస్థాయిలో ఉంచుతాయి. ముఖ్యంగా ఫైబర్‌ ఉండే ఆహారపదార్థాలు కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది. తొందరగా ఆకలి వేయదు. 
 • ఎక్కువ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే పదార్థాలు తీసుకోండి. ఇవి గ్లైసమిక్‌ ప్రభావాన్ని తగ్గించి గ్లూకోజ్‌ స్థాయిలను సమతుల్యం చేయడంలో కీలకంగా ఉంటాయి. అలాగే కండర ద్రవ్యరాశిని పెంచడానికి ప్రోటీన్లు సహాయపడతాయి. 
 • వీటి తోపాటు, ఆలివ్‌ నూనె, అవకాడో, చేపలు, గింజలు, వంటివి ఆహరంలో చేర్చితే ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలను తగ్గిస్తాయి. 
 • నీటిని పుష్కలంగా తాగండి. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిని పలుచన చేసి మూత్రం ద్వారా గ్లూకోజ్‌ని బయటకు పంపి, రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఆకలిని తగ్గించి కేలరీలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. కనీసం రోజూకి సుమారు ఎనిమిది గ్లాసుల వరకు నీటిని తీసుకోండి. 
 • చక్కెర, కెఫిన్‌, ఆల్కహాల్‌ కృత్రిమ స్వీటెనర్లు కలిగిన పానీయాలకు(కూల్‌డ్రింక్‌లు) దూరంగా ఉండండి
 • ఒత్తిడిని తగ్గించుకోండి. ఎందుకంటే? ఇది అడ్రినల్‌ ​వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపించి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను పెంచుతుంది. నిజానికి ఈ ఒత్తిడి అనేది కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన మూలం అని గుర్తించుకోండి. దీన్ని జయించాలంటే యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని తప్పనసరిగా చేయాలి. తగినంతగా నిద్రపోండి. ఇవన్నీ రోజూ వారిగా అందరికీ ఉండే సమస్యలే అని కొట్టిపారేసి ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి
 • మీ ఆహారం లేదా జీవనశైలిలో మార్పులు చేయాలనుకుంటే మంచి డైటీషియన్‌ లేదా వైద్య నిపుణుడి సలహా తీసుకోండి. తదితర జాగ్రత్తలు తీసుకుంటే గ్లూకోజ్‌ స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా మెరుగైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.

(చదవండి: భారత్‌ డయాబెటిస్‌కి క్యాపిటల్‌గా మారుతోందా? 101 మిలియన్ల మందికిపైగా..!)

మరిన్ని వార్తలు