Fire Effect In 5D Cinema: థియేటర్‌లో మంటలు అంటుకున్నా పక్కకు జరగని ఆడియెన్స్‌.. కారణమిదే!

14 Oct, 2023 12:31 IST|Sakshi

టెక్నాలజీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. రకరకాల వింతలు, అద్భుతాలతో మనిషి చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసికొట్టేలా చేస్తున్నాయి. తాజాగా 5డీ ఎఫెక్ట్‌తో థియేటర్‌లో ఫైర్‌ సీన్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో టెక్నాలజీ ఓవర్‌ డోస్‌పై మరోసారి చర్చనీయాంశమైంది. 

ఇప్పటివరకు మనకు 2డీ, 3డీ,4డీ సినిమాల గురించి తెలుసు. ఇది భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో తెరపై వండర్స్‌ క్రియేట్‌ చేసేలా చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్స్‌తో సినిమాలోని పాత్రలూ, దృశ్యాలు మనల్నీ మమేకం చేసేలా చేస్తాయి. అక్కడ జరుగుతున్న సీన్స్‌ నిజంగా మనచుట్టూ జరుగుతున్నాయేమో అనుకునేలా విజువల్స్‌లో కనిపిస్తాయి. స్క్రీన్‌పై సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ ఫీల్‌ని ఎంజాయ్‌ చేసేలా చేస్తుంది. సినిమాలో వర్షం పడినా, మంచు కురిసినా..చూసే ప్రేక్షకులకు కూడా కొన్ని సాంకేతిక పద్ధతులతో ఆ ఫీలింగ్‌ కలిగించేలా చేస్తుంది.

ఇప్పుడు 5డీ థియేటర్లు ఒక అడుగు ముందుకేసి ఆడియెన్స్‌కు ఆ ఫీల్‌ను మరింత దగ్గర చేసింది. కానీ మితిమీరిన టెక్నాలజీ వాడకంతో కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు అనేలా గుర్తుచేస్తుంది ఈ వైరల్‌ వీడియో.  5డీ ఎక్స్‌ స్క్రీన్‌తో  సినిమా థియేటర్‌లో ప్రేక్షకులు మూవీని ఎంజాయ్‌ చేస్తుండగా సడెన్‌గా ఓ ఫైర్‌ యాక్సిడెంట్‌కి సంబంధించిన సీన్‌ పడింది. అంతే క్షణాల్లో థియేటర్‌ మొత్తం అంటుకున్నట్లు కనిపించింది. ఇది చూసిన ప్రేక్షకులు కూడా భలే థ్రిల్‌గా ఫీల్‌ అయ్యారు. అయితే ఇది రియల్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

అయితే ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.  5డీ ఎఫెక్ట్‌ బాగానే ఉంది కానీ, నిజంగానే ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? ప్రేక్షకుల ప్రాణాలతో ఇలా చెలగాటం ఆడొద్దంటూ థియేటర్‌ ఓనర్స్‌పై గుర్రమంటున్నారు. మరోవైపు టెక్నాలజీని మితిమీరి వాడితే అనర్థాలే తప్పా మరొకటి ఉండదు. స్పేస్‌, వాటర్‌ వరకు ఓకే కానీ ఇలా నిప్పుతో చెలగాటం ఏంటి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


 

మరిన్ని వార్తలు