కూరల్లో గ్రేవీ కోసం..చల్లటి నీళ్లు పోస్తున్నారా..!

30 Aug, 2023 09:55 IST|Sakshi

కూరలు వండేటప్పుడే ఒక్కొసారి బాగా రావు. లేదా గ్రేవీ అంతా దగ్గరగా అయిపోవడం వంటివి జరుగుతాయి. అలాంటప్పుడు చిన్న చిన్న ఈ చిట్కాలు పాటిస్తే వాటినిపడేయాల్సిన అవసరం లేకుండా మంచిగా వాడుకోవచ్చు. అలాగే రుచి పోకుండా చేయొచ్చు కూడా. అవేంటో చూసేద్దామా!.

గ్రేవి రుచికరంగా పోషకాలు పోకుండా ఉండాలంటే..

  • పాలకూరలో టీస్పూను పంచదార, కాసిన్ని నీళ్లుపోసి పది నిమిషాలపాటు మరిగించి, తరువాత చల్లటి నీటిలో వేయాలి. చల్లారాక గ్రైండ్‌ చేసి గ్రేవీల్లోకి వాడుకుంటే పాలకూరలోని పోషకాలు బయటకు పోకుండా ఉంటాయి.
  • కూరల్లో గ్రేవీ కోసం కొన్నిసార్లు నీళ్లు పోస్తుంటాము. అయితే ఇలా పోసే నీళ్లను కాస్త మరిగించి పోస్తే కూర వేడికి వేడినీళ్లు చక్కగా సరిపోయి గ్రేవీ మరింత రుచికరంగా వస్తుంది. చల్లటి నీళ్లుపోస్తే ఆ నీరు కూర ఉష్ణోగ్రతలకు చేరుకోవడానికి సమయం పట్టి గ్రేవీ అంత రుచిగా రాదు.

కారం ఎక్కువైతే..

  • ఆలు పరాటా చేసేటప్పుడు .. ఉడికించిన బంగాళదుంపలను ఇరవై నిమిషాలపాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక దుంపల తొక్కతీసి ఆలు పరోటా చేస్తే దుంపల మిశ్రమం అతుక్కోకుండా, జిగట లేకుండా పరాటాలు చక్కగా వస్తాయి. 
  • కూరలో కారం, మసాలా ఘాటు ఎక్కువైనప్పుడు, పెరుగు, ఫ్రెష్‌క్రీమ్, పాలు... వీటిలో ఏ ఒక్కటైనా కూరను బట్టి రెండు మూడు టే బుల్‌ స్పూన్లు వేసి కలిపితే ఘాటు తగ్గుతుంది. 

(చదవండి: ఆ పార్కులో మాటల్లేవ్‌! కేవలం నిశబ్దమే..మనుషులంతా విగ్రహాలే!)

మరిన్ని వార్తలు