ఇంట్లోనే పిజ్జా చేసుకునేలా సరికొత్త మేకర్‌!

5 Nov, 2023 13:37 IST|Sakshi

ఈ రోజుల్లో ఇంట్లోనే పిజ్జా మేకర్‌ ఉండాలని కోరుకుంటున్నారు పిజ్జా లవర్స్‌. ఈ ప్రొఫెషనల్‌ ఓవెన్‌ వంటగదిలో ఉంటే.. ఇష్టమైన పిజ్జాలను నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. మెషిన్‌ దిగువన ఉండే డ్యూయల్‌ హీటింగ్‌ ఎలిమెంట్స్‌ పైనున్న సిరామిక్‌ పిజ్జా ట్రేని వేడి చేస్తాయి. ఈ బేకింగ్‌ స్టోన్‌ పిజ్జాని వేగంగా గ్రిల్‌ చేస్తుంది. లో, హై, మీడియం అనే ఆప్షన్స్‌తో రూపొందిన ఈ మేకర్‌.. ఉపయోగించడం చాలా సులభం.

పై మూడు ఆప్షన్స్‌తో టెంపరేచర్‌ని అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. దీనిలో సుమారుగా 11 అంగుళాల పిజ్జాను తయారు చేసుకోవచ్చు. ఇదే మోడల్‌లో కలర్స్, ఆప్షన్స్‌ వేరువేరుగా ఉండే డివైస్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 

(చదవండి: డబుల్‌ సైడ్‌ మల్టీమేకర్‌! నూనె లేకుండా..)

మరిన్ని వార్తలు