Beauty Tips: ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

19 Oct, 2023 10:51 IST|Sakshi

బ్యూటీ టిప్స్‌

►  పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్‌గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం పేస్ట్‌ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

 కొబ్బరి పాలలో దూదిని ఉంచి 15 నిమిషాల పాటు ముఖానికి మర్దనా చేయాలి. ఇది ట్యాన్‌ని రిమూవ్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 
కలబంద గుజ్జును ముఖంపై అప్లై చేశాకా 15 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో కడిగేయాలి. ఇది స్కిన్‌టోన్‌ని సాఫ్ట్‌గా చేస్తుంది.

రెండు కర్పూరం బిళ్లలు, మూడు కప్పల వేపాకుల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి పేస్టుచేయాలి. ఈ మిశ్రమాన్ని చుండ్రు ఉన్న ప్రాంతంలో రాసి మర్దన చేయాలి. చుండ్రు బాధ క్రమంగా తగ్గిపోతుంది. కర్పూరం పొడిని ఆలివ్‌ నూనెలో వేసి కలిపి జుట్టుకు పట్టించినా చుండ్రు తగ్గుతుంది.  ఈ రెండింటిలో ఏదైనా ఒకటి వారానికి మూడుసార్లు చేస్తే ఉపశమనం త్వరగా వస్తుంది.

► కాలివేళ్ల సందుల్లో గాలి తగలక పాచిపడుతుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే...కాళ్లను శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు టూత్‌పేస్టుని వేళ్ల సందులో రాయాలి. రోజూ పడుకునేముందు ఇలా చేస్తే కాళ్లు పాయవు.  

 ఒక బౌల్‌లో హాఫ్‌ కప్‌ అవకాడో గుజ్జు తీసుకోండి. అందులో 1 టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌.. 2 చుక్కల తేనె వేసి బాగా కలపండి. ఆ మిక్సర్‌ని మొహానికి అప్లయ్‌ చేసి.. 15 మినట్స్‌ వరకు అలాగే ఉంచేయండి. తర్వాత కోల్డ్‌ వాటర్‌తో ఫేస్‌ వాష్‌ చేసుకోండి.  

మరిన్ని వార్తలు