కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీ రావాలి: సీఎం రేవంత్‌రెడ్డి

10 Dec, 2023 12:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. కేసీఆర్‌ను పరామర్శించేందుకు సీఎం రేవంత్‌ సహా మంత్రులు ఆదివారం యశోద ఆసుపత్రికి వెళ్లారు. 

సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం రేవంత్‌.. కేటీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, వార్డులో ఉన్న కేసీఆర్‌ వద్దకు రేవంత్‌, కేటీఆర్‌ కలిసి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం, యశోద ఆసుపత్రి వద్ద రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్‌ను పరామర్శించాను. ఆయన కోలుకుంటున్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీ రావాలి’ అని కామెంట్స్‌ చేశారు.   

ఇక, మాజీ సీఎం కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూమ్‌లో కాలిజారి కిందపడిపోవడంతో ఎడమ కాలి తొంటికి తీవ్ర గాయమైంది. దీంతో​, కేసీఆర్‌కు యశోద ఆసుపత్రి వైద్యులు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ ఆపరేషన్‌ చేశారు. కాగా, ఆపరేషన్‌ అనంతరం కేసీఆర్‌ కోలుకుంటున్నారు. వాకర్‌ సాయంతో కేసీఆర్‌ను వైద్యులు నడిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

>
మరిన్ని వార్తలు