హాట్‌ అండ్‌ కూల్‌ ట్రావెలింగ్‌ రిఫ్రిజిరేటర్‌.. ధర 6 వేలు!

2 May, 2022 17:27 IST|Sakshi

Hot And Cool Traveling Refrigerator: ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. దూర ప్రాంతాలకు వెళ్తున్నపుడు నాలుగు జతల బట్టలతో సహా ఆ నాలుగు రోజులకు సరిపడా ఫుడ్‌ కూడా వెంట తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. పండ్లు, కూరగాయలు, వండుకున్న పదార్థాలను నిలవ ఉంచుకోవాలన్నా.. కాలానికి తగ్గట్టు చల్లటి పానీయాలు, వేడివేడి కాఫీలు అందుబాటులో పెట్టుకోవాలన్నా.. ఇలాంటి మినీ కూలర్‌ అండ్‌ వార్మర్‌ను మీ లాగేజ్‌లో భాగం చేసుకోవాల్సిందే.

దీన్ని బెడ్‌ రూమ్‌లో, ఆఫీస్‌ క్యాబిన్లో, ప్రయాణాల్లో ఎక్కడైనా చక్కగా వినియోగించుకోవచ్చు. దీని పైభాగంలో ప్రత్యేకమైన హ్యాండిల్‌ కూడా ఉంటుంది. దాంతో ఎక్కడికైనా సులభంగా మోసుకుని వెళ్లొచ్చు. ఇది ఎన్విరాన్‌మెంటల్‌ ఫ్రెండ్లీ డివైజ్‌. దీని కూలింగ్‌ రేంజ్‌ 20 డిగ్రీల సెల్సియస్‌. హీటింగ్‌ రేంజ్‌ 60 డిగ్రీల సెల్సియస్‌. దాంతో వేసవిలో చల్లని శీతలపానీయాలను, శీతాకాలంలో వేడివేడి కాఫీలను అందిస్తుంది.

ఇందులో కావాల్సిన టాబ్లెట్స్, బ్యూటీ కాస్మెటిక్స్‌ ఇలా అన్నింటినీ స్టోర్‌  చేసుకోవచ్చు. పైగా ఇది స్టైలిష్‌ టెంపర్డ్‌ గ్లాస్‌ ప్యానెల్‌ కలిగి ఉండటంతో దీన్ని క్లీన్‌ చేసుకోవడం చాలా తేలిక. అవసరాన్ని బట్టి ఇందులో బాస్కెట్స్‌ను అమర్చి, చిన్న చిన్న విభాగాలుగా మార్చుకుని, చాలా రకాలు స్టోర్‌ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మధ్యలో పెట్టుకునే ర్యాక్స్‌ లేదా బాస్కెట్స్‌ను తొలగించి.. పొడవాటి డ్రింక్‌ బాటిల్స్‌ వంటివి పెట్టుకోవచ్చు. దీనికి రెండు పవర్‌ మోడ్స్‌ లభిస్తాయి. ఒకటి ఇంట్లో పవర్‌ సాకెట్‌కి అమర్చుకునేది. మరొకటి కారులో కనెక్ట్‌ చేసుకునేది. భలే ఉంది కదూ!
ధర: 80 డాలర్లు (రూ.6,101) 

చదవండి: Ice Cream Maker: 10 నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌ రెడీ.. ధర రూ.2,215!

మరిన్ని వార్తలు