పెడిక్యూర్‌ కోసం పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు, సింపుల్‌గా ఇంట్లోనే..

11 Oct, 2023 10:31 IST|Sakshi

పెడిక్యూర్‌ ఇప్పుడు ఇంట్లోనే.. 

పాదాలను మెరిపించడంలో అరటితొక్కలు చక్కగా పనిచేస్తాయి.
అరటితొక్కలను పాదాలపైన రుద్దితే మృతకణాలు, దుమ్మూ ధూళీ తొలగిపోతాయి. 
► అరటి తొక్కలను ముక్కలుగా తరిగి కొద్దిగా తేనె వేసి పేస్టు చేయాలి. ఈ పేస్టుని పాదాలకు రాయాలి. అరగంట తరువాత సాధారణ నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారడంతో పాటు, చక్కగా మెరుస్తాయి.
► అరటితొక్కల పేస్టులో కొద్దిగా అలోవెరా జెల్‌ కలపాలి. ఈ పేస్టుని పాదాలకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ పేస్టు పాదాలకు తేమనందించి కోమలంగా ఉంచుతుంది.
► అరటితొక్కల పేస్టులో కాఫీ పొడి, తేనె వేసి కలిపి స్క్రబర్‌లా పదిహేను నిమిషాలు రుద్దాలి. పాదాలపైన మురికి, మలినాలు పోయి చక్కగా మెరుస్తాయి.

మరిన్ని వార్తలు