Sakshi News home page

మరమరాలతో వడ.. సింపుల్‌గా ఇలా చేసుకోండి

Published Tue, Nov 28 2023 4:20 PM

How To Make Maramaralu Vada Recipe In Telugu - Sakshi

మరమరాల వడ.. తయారీకి కావలసిన పదార్ధాలు

  • మరమరాలు – 3 కప్పులు (నీటిలో నానబెట్టి, గట్టిగా పిండి ఒక బౌల్‌ల్లోకి తీసుకోవాలి)
  • పెరుగు – 3 టేబుల్‌ స్పూన్లు
  • గోధుమ పిండి – పావు కప్పు
  • మైదా పిండి – పావు కప్పు
  • అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు – 1 టీ స్పూన్‌ చొప్పున
  • తెల్ల నువ్వులు – 1 టీ స్పూన్‌ + గార్నిష్‌కి
  • కారం – ఒకటిన్నర టీ స్పూన్,  నీళ్లు – కొన్ని
  • ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్,
  • పంచదార – 2 టీ స్పూన్లు, నిమ్మ రసం – 1 టీ స్పూన్,
  • నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తురుము – కొద్దిగా

తయారీ విధానం
ముందుగా మరమరాలను గట్టిగా పిసికి, అందులో పెరుగు వేసుకుని బాగా కలిపి, 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. అనంతరం అందులో గోధుమ పిండి, మైదా పిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు, 1 టీ స్పూన్‌ తెల్ల నువ్వులు, కారం, ఉప్పు, గరం మసాలా, పంచదార, నిమ్మరసం, 3 టీ స్పూన్ల నూనె, కొత్తిమీర తురుము వేసుకుని బాగా ముద్దలా చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న కట్లెట్స్‌ మాదిరి చేసుకుని, ప్రతి కట్లెట్‌కి కాస్త తడి చేసి, పైన నువ్వులు పెట్టి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. 

Advertisement
Advertisement