క్యారట్‌ చికెన్‌ మఫిన్స్‌.. చిన్న పిల్లలు ఇష్టం తింటారు

30 Sep, 2023 13:25 IST|Sakshi

క్యారట్‌ చికెన్‌ కప్స్‌ తయారీకి కావల్సినవి:

క్యారట్‌ తురుము – కప్పు; వెల్లుల్లి తురుము – పావు కప్పు;
బాదం పప్పు పొడి – ముప్పావు కప్పు; చీజ్‌ తురుము – ముప్పావు కప్పు;
కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను; గుడ్డు – ఒకటి; చికెన్‌ ఖీమా – అరకప్పు;
ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా

తయారీ విధానమిలా:
పెద్ద గిన్నెలో క్యారట్, వెల్లుల్లి, చీజ్‌ తురుములు, కొత్తిమీర చికెన్‌ ఖీమా, రుచికిసరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి ∙చివరిగా గుడ్డుసొనను కూడా వేసి కలపాలి ∙ఈ మిశ్రమాన్ని మఫిన్‌ ట్రేలో వేసి ఇరవై నిమిషాల పాటు బేక్‌ చేయాలి ∙గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లో క్రిస్పీగా మారితే చికెన్‌ క్యారట్‌ కప్స్‌ రెడీ.

మరిన్ని వార్తలు