Natural Themes: ప్రతిది నేచురల్‌గా.. సరసమైన ధరలకే సస్టైనబుల్‌ ఫర్నిషింగ్‌!

2 Feb, 2023 15:02 IST|Sakshi

ఒత్తిడిగా ఉన్నప్పుడు, ప్రశాంతత కావాలనుకున్నప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉండాలన్న ఆరాటం పెరుగుతుంది. ఇంటి వాతావరణాన్నే అలా మార్చుకుంటే అనే ఆలోచన వస్తుంది. అలా ప్రకృతి ఇంటి అలంకరణలో భాగమై నేచురల్‌ థీమ్‌గా ఇలా సెటిల్‌ అయింది.  

పెద్ద పెద్ద బ్రాండ్లు
ప్రకృతిని మరిపించే వస్తువులను తయారుచేయడానికి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. మన దేశీ వస్తువులు కూడా ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ట్యాగ్‌తో హుందాగా ప్రపంచ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. 

కళాత్మక వస్తువులు
రాజస్థాన్, జైపూర్‌ కళాకృతులు గ్లోబల్‌ ట్రెండ్‌గా ఆకట్టుకుంటున్నాయి. వీటి నుంచి కొత్త తరహా డిజైన్లనూ సృష్టిస్తున్నారు. కుషన్‌ కవర్లు, క్విల్ట్‌లు, టెర్రకోట వస్తువులు, బ్యాగ్‌లు, ఖరీదైన బొమ్మలు, సిరామిక్స్, కర్ర, మెటల్‌.. ఇలా ఇల్లు, వంటగది, తోట కోసం కళాఖండాల సేకరణ ఊపందుకుంటోంది.

విషయమైన పింక్‌లే బ్రాండ్‌ సృష్టికర్త తన్వానీ మాట్లాడుతూ ‘మా కంపెనీ హోమ్‌ మేడ్‌ వస్తువుల తయారీని ఏడేళ్ల కిందటే మొదలుపెట్టింది. నాటి నుంచి ఏనాడూ వెనుదిరిగి చూసుకోనంత ముందుకు వెళ్తోంది’ అని చెబుతుంది.

ఆన్‌లైన్‌లో నేచర్‌..
గతంతో పోల్చితే ప్రకృతి సిద్ధమైన వాటితో తయారైన వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా తెప్పించుకోవడానికి వినియోగదారులు ఎక్కువ శాతం ఉత్సాహం చూపుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. వీటిలో బ్రాండ్‌ కన్నా ఆ వస్తువు కళాత్మకతపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టూ తెలుస్తోంది. 

ఖరీదైన వస్తువుగా!
‘సరసమైన ధరలకే సస్టైనబుల్‌ ఫర్నిషింగ్‌ను సృష్టించడం మా లక్ష్యం’ అంటున్నారు బెంగుళూరులో ది ఎల్లో డ్వెల్లింగ్‌ కంపెనీ అధినేత అభినయ సుందరమూర్తి. పత్తి, నార, గడ్డి, వెదురు వంటి సహజమైనవాటిని ఉపయోగించి ఫంక్షనల్‌ హోమ్‌ డెకర్‌ ఉత్పత్తులను రూపొందిస్తోందీ కంపెనీ. ఔట్‌డోర్, బాల్కనీలను డిజైన్‌ చేయడానికి మంచి శిల్పాలు, వెదురుతో చేసిన వస్తువులను అమర్చుతున్నారు. 

చదవండి: Samantha: దేవనాగరి చీరలో సమంత! సంపన్నుల బ్రాండ్‌.. కోటి రూపాయల విలువైన ఫ్రేమ్స్‌ కూడా..!
Pratiksha Soni: మహాత్ముడే మాకు ఉపాధి కల్పించాడు.. బాపూజీ బాటలో..

మరిన్ని వార్తలు