Kitchen Tips Using Lemon: నిమ్మచెక్కలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఏం అవుతుందంటే..

19 Sep, 2023 10:15 IST|Sakshi

కిచెన్‌ టిప్స్‌ :

నిమ్మచెక్కతో మరకలు ఈజీగా పోతాయి కాయగూరలు తరిగే చెక్కని నిమ్మచెక్కతో రుద్ది కాసేపయ్యాక కడిగేయండి. మరకలు పోతాయి. ఎప్పుడైనా దానిపై  మాంసం కోసినా.. నిమ్మచెక్కతో రుద్దాలి. క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి.
► నిమ్మచెక్కలని సన్నగా తరిగి కాసిని నీళ్లలో వేసి ఆ పాత్రని మైక్రో ఓవెన్‌ లో కొన్ని నిమిషాలు ఉంచి తీసేయండి. అలా చేస్తే దుర్వాసనలు తొలగిపోవడంతో పాటూ లోపల పడి ఉన్న పదార్థాలని శుభ్రం చేయడం కూడా తేలికవుతుంది.


► ఫ్రిజ్‌లో ఓ మూలగా నిమ్మచెక్కని పెట్టి చూడండి. అందులోంచి వచ్చే దుర్వాసనలు పోతాయి.
► స్టీలు కుళాయిలపై నీటిమరకలు పడుతుంటాయి. అవి తెల్లగా మారాలంటే వాటిని నిమ్మచెక్కతో రుద్ది కడిగితే చాలు.

మరిన్ని వార్తలు