పాండవులు సొరంగము తవ్వే వానికి ఏం చెప్పారు?

24 Nov, 2020 07:27 IST|Sakshi

ప్రశ్నోత్తర భారతం

58. పురోచనుడు తన భార్యను ఎవరి దగ్గర నియోగించాడు?
59. ఆమె చేయవలసిన పని ఏమిటి?
60. కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఏం జరిగింది?
61. ఉత్సవం ముగిశాక ఏం జరిగింది?
62. పురోచనుడు ఎక్కడ నిద్రించాడు?
63. అర్ధరాత్రి సమయంలో ఏం జరిగింది?
64. పాండవులు సొరంగము తవ్వే వానికి ఏం చెప్పారు?
65. పాండవులు ఏం చేశారు?

జవాబులు
58. కుంతి దగ్గర; 59. నిత్యం కుంతి రహస్యాలను పురోచనుడికి తెలియపరచాలి. ఆమె అలాగే చేసేది; 60. ఆ రోజు రాత్రి లక్క ఇంటిలో పాండవులు గొప్ప ఉత్సవం చేశారు. నిషాద స్త్రీ, ఆమె ఐదుగురు కొడుకులు కల్లు తాగారు. తెలివి తప్పి పడిపోయారు. లక్క ఇంటి పక్కనే నిద్రించారు; 61.  ఉత్సవం ముగిసింది. అర్ధరాత్రి అయ్యింది. అందరూ నిద్రించారు; 62. ఆయుధాగారంలో నిద్రించాడు; 63. ధర్మరాజు సమయం చూశాడు. భీముడికి అనుమతి ఇచ్చాడు. భీముడు నిప్పు అందుకుని, ఆయుధాగారపు ద్వారానికి నిప్పు అంటించాడు. భగ్గున మండింది. పురోచనుడు ఆ మంటల్లో మరణించాడు; 64. వారి కుశలం తెలిపారు. విదురునికి తెలియపరచమన్నారు; 65. బిలంలోకి ప్రవేశించారు.   –నిర్వహణ: వైజయంతి పురాణపండ 

మరిన్ని వార్తలు