నిద్రలేమి అనారోగ్యాలను తీవ్రతరం చేస్తున్న కోవిడ్‌! 

15 May, 2022 14:52 IST|Sakshi

మానసిక ఆరోగ్యంపై మరింత ప్రభావం 

నిద్రలేమి వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం... దాంతో అనేక అనారోగ్యాలు కలుగుతాయన్నది తెలిసిందే. కానీ నిద్రలేమితో బాధపడేవారికి కోవిడ్‌ సోకితే... దానివల్ల అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయనీ... పైగా మానసిక అనారోగ్యాలూ కలుగుతాయని తాజాగా నిరూపితమైంది. 

మంచి ఆరోగ్యం కోసం ఎంతసేపు నిద్రపోవాలన్న అంశం చర్చనీయాంశమైనప్పటికీ... సాధారణంగా యువతీ–యువకులకు కనీసం ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలని, కౌమార బాలబాలికలైతే అంతకంటే మరో గంట ఎక్కువే నిద్రపోవాలనీ... అప్పుడే వారిలో జ్ఞాపకశక్తి, పెరుగుదల ఉంటాయని నిద్ర నిపుణులు చెబుతుంటారు. మామూలుగా ఆరు గంటలు నిద్ర కూడా సరిపోతుందని కొందరు చెబుతుంటారుగానీ... ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారికి కోవిడ్‌ సోకినప్పుడు వారిలో చాలామంది మానసిక అనారోగ్యాలకు గురయ్యారని ఇటీవలి కోవిడ్‌ సోకిన రోగులను పరిశీలించినప్పుడు తెలియవచ్చింది.

అంతేకాదు.. హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన అధ్యయనవేత్తల పరిశీలనలోనూ ఇదే నిజమని తేలింది. ఇలా నిద్రలేమితో బాధపడేవారికి కోవిడ్‌ సోకినప్పుడు వాళ్లలో ఎక్కువ మంది అంటే దాదాపు 75›శాతానికి పైగా మానసిక అనారోగ్యాల బారిన పడ్డారనీ... అందులోనూ డిప్రెషన్‌తో కుంగుబాటుకు లోనైనవారే ఎక్కువనీ, అటు తర్వాత యంగై్జటీ వంటి బాధలకు గురయ్యారని కూడా వైద్యుల పరిశీలనలో తేలింది.

సంఖ్యాపరంగా చూస్తే... డిప్రెషన్, యాంగై్జటీల తర్వాత భావోద్వేగాల పరంగానూ, భౌతికంగానూ బాగా అలసటగా ఫీలయ్యేవారు ఎక్కువన్నది నిపుణుల మాట. మానసిక ఆరోగ్యానికి నిద్ర మరింత అవసరమనే అంశం నిర్ద్వంద్వంగా నిరూపితమయ్యిందంటున్నారు హార్వర్డ్‌కు చెందిన పరిశోధకులు.   

మరిన్ని వార్తలు