ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ నేర్పిన పాఠం! అభివృద్ధి పేరుతో పేదల జీవితాలతో ఆడుకోవద్దు!

29 Nov, 2023 14:37 IST|Sakshi

దీపావళి రోజున ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్‌ కూలిపోవడంతో సొరంగంలో 41 మంది చిక్కుకుపోయిన ఘటన యావత్త్‌ దేశాన్ని కలవరిపరిచింది. వారంతా బయటకు రావాలని కులమతాలకు అతీతంగా అందరూ ప్రార్థించారు. ఆ ప్రార్థనలు ఫలించాయో లేక ఆ కూలీలను రక్షించేందుకు అహర్నిశలు కష్టపడుతున్న రెస్క్యూ బృందాల కృషికి అబ్బురపడి ప్రకృతి అవకాశం ఇచ్చిందో గానీ వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవ్వరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు కూడా ప్రకటించడం అందర్నీ సంతోషంలో ముచ్చెత్తింది. దాదాపు 17 రోజుల నరాల తెగే ఉత్కంఠకు తెరపడి జయించాం​ అనే ఆనందాన్ని ఇచ్చింది. సరే గానీ ఈ ఉత్తర కాశీ టన్నెల్‌ ఘటన మన భారత ప్రభుత్వానికి, పరిశ్రమలకు ఓ గొప్ప పాఠాన్ని నేర్పాయి. అభివృద్ధి అనే పేరుతో ఏం జరుగుతుందో ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపింది. అలాగే పర్యావరణం కూడా ఎలా మసులుకోవాలో మానవుడిని పరోక్షంగా హెచ్చరించింది. ఆ ఉత్తర కాశీ ఘటన నేర్పిన గుణపాఠం ఏంటంటే..

నిజానికి ఆ ఉత్తరకాశీ సిల్క్యారా సోరంగం నరేంద్ర మోదీ ప్రభుత్వం చార్‌థామ్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన నిర్మాణం. ఇది హిందూ ప్రముఖ క్షేత్రాలను కలుపుతుంది. ఇది పూర్తి అయితే యమునోత్రికి వెళ్లే యాత్ర మార్గం 20 కిలోమీటర్లు తగ్గుతుంది. భక్తుల చార్‌ధామ్‌ యాత్ర సులభతరం చేసేందుకు నిర్మించిన భూగర్భ మార్గం అని చెప్పాలి. కానీ ఇలా అభివృద్ధి పేరుతో చేపట్టే ప్రాజెక్టుల్లో పేద ప్రజల జీవితాలు ఎలా అగాధంలో పడతాయనేది అనేది అందరికీ తెలిసేలా చేసింది ఈ ఘటన. ఇప్పటి వరకు మనం నిర్మించిన చాలా ప్రాజెక్టులో చాలామంది కార్మికులు ప్రాణాలు కూడా ఇలానే పోయాయా అనే ఆలోచన కూడా వచ్చింది. ఆ ఘటనలు జరిగిన మీడియా మాధ్యమాలు, వార్త పత్రికల పుణ్యమాని ఒకటి రెండు రోజులే హాటాపిక్‌గా ఆ విషయంగా ఉంటుంది.

ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. అబ్బా! భారత్‌ ఎంతో ముందకు పోతుంది. ఎన్నో ఫైఓవర్లు, భూగర్భ రైలు మార్గాలు ఏర్పాటు చేసేశాం, టెక్నాలజీని అందుకుంటున్నాం అని స్టేమెంట్‌లు నాయకులు ఇచ్చేస్తుంటే..అదే నిజం అని గర్వంగా ఫీలైపోతాం. నిజానికి ఆయా పెద్ద పెద్ద రహాదారుల లేదా రైల్వే నిర్మాణాలకు వెనక ఉన్న కార్మికుల శ్రమ ఎవ్వరికి తెలియదు. ఆ నిర్మాణం జరుగుతున్న సమయంలో పేదల జీవితాలు ఎలా చిధ్రమయ్యాయి అన్నది కూడా పట్టదు. నాయకులు, అధికారులు ఇలాంటి పెద్ద నిర్మాణాలు, ప్రాజెక్టులు కట్టేటప్పుడూ ఇవన్నీ కామన్‌ అన్నట్టు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇలాంటి ఉత్తరకాశీ లాంటి కొన్ని ఘటనలు తెరమీదకు రాకుండానే కనుమరుగయ్యాయి. అందువల్లే సాధారణ ప్రజలకు కూడా ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయన్న విషయం కూడా తెలియదు. ఈ టన్నెల్‌ కూలిన ఘటన ప్రభుత్వాలకు, పరిశ్రమలకు పేదల జీవితాలతో చెలగాటం ఆడొద్దని నొక్కి చెప్పింది. 

కూలే అవకాశం ఉందని ముందే తెలుసా..!
ఈ టన్నెల్‌ నిర్మాణాన్ని నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ చేపట్టింది. ఇదే కంపెనీ కాంట్రాక్టర్లు గతంలో మహారాష్ట్ర థానే జిల్లాలో నాగ్‌పూర్‌-ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేని నిర్మించిన ఘటన ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగి 20 మంది కార్మికులు, ఇంజనీర్లు మరణించారు. దీంతో ఆయ కంపెనీ కాట్రాక్టర్‌లపై ఎఫైర్‌ కూడా నమోదైంది. మరీ మళ్లీ అదే కంపెనీకి ఈ ఉత్తరకాశీ టన్నెల్‌ ప్రాజెక్ట్‌ అప్పగించడం అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇక జర్మన్-ఆస్ట్రియన్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ బెర్నార్డ్ గ్రుప్పీ మన భారత కంపెనీ నవయగ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌కి టన్నెల్‌ నిర్మాణ ప్రారంభానికి ముందు నుంచి కూడా టెండర్‌ డాక్యుమెంట్‌లో ఊహించిన దానికంటే భౌగోళిక పరిస్థితులు చాల సవాళ్లుగా ఉన్నాయని హెచ్చరించింది. అందువల్ల ఎలాంటి ప్రమాదాల సంభవిస్తే బయటపడేలా ఎస్కేప్ పాసేజ్‌ని నిర్మించమని 2018లోనే ఆదేశించింది. మరీ ఇక్కడ సొరంగం కూలిపోయేంత వరకు కూడా దాన్ని ఎందుకు నిర్మిచలేదనేది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతం బయట పడ్డ ఆ కూలీలంతా ఈ ఎస్కేప్‌  పాసేజ్‌ నుంచే సురక్షితంగా బటయకొచ్చిన సంగతి తెలిసిందే. 

డెవలప్‌మెంట్‌ పర్యావరణాన్ని ప్రమదంలో పడేస్తుందా?
ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలకు నిలయం హిమాలయ పర్వతాలు. దాదాపు 45 మిలియన్‌ ఏళ్ల క్రితం ఏర్పడినవి. నిజానికి ఈ ప్రాంతం ఎక్కువుగా భూకంపాలకు గురయ్యే ప్రాంతం కూడా. పైగా ఇక్కడ శిలలు అవక్షేపణ శిలలుగా ఉంటాయి. పైగా ఇక్కడ పర్యావరణం అస్థిరంగ ఉంటుంది. నిర్మాణ పద్ధతులకు అస్సలు అనూకులమైనది కూడా కాదు. అలాంటి ప్రదేశంలో అభివృద్ధి పేరుతో మనం చేస్తున్న పనులు ముఖ్యంగా పర్యావరణానికి ఇబ్బంది కలిగించేవే.

ఈ విషయమై ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు ఎస్‌కె పట్నాయక్ ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. మన జీవన శైలి సౌలభ్యానికి అవసరమైన మార్పలు ఎంత అవసమో పర్యావరణాన్ని విఘాత కలగించకుండా చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది కూడా అంతే ముఖ్యం. లేదంటే ప్రకృతి ప్రకోపానికి బలవ్వక తప్పదు. కానీ ఇలాంటి విపత్తులో బలయ్యేది కూడా  పేద కార్మికులే అనే విషయం గుర్తించుకోవాలి అధికారులు.

(చదవండి: ఎక్కువ రోజులు సొరంగంలో ఉంటే కార్మికుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది! వైద్యుల ఆందోళన)

మరిన్ని వార్తలు