బనానా బ్రెడ్‌ రోల్స్‌.. టేస్ట్‌ అదిరిపోద్ది, ట్రై చేశారా?

4 Dec, 2023 10:40 IST|Sakshi

బనానా బ్రెడ్‌ రోల్స్‌ తయారీకి కావల్సిన పదార్థాలు
అరటిపండ్లు – 2, బటర్, నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున,  
పంచదార – 3 టేబుల్‌ స్పూన్లు (అభిరుచిని బట్టి తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు)
బ్రెడ్‌ స్లైస్‌ – 6 లేదా 8

తయారీ విధానమిలా:
ముందుగా అరటిపండ్లను ముక్కలుగా చేసుకుని.. ఒక టేబుల్‌ స్పూన్‌  బటర్‌లో బాగా వేగించాలి. మెత్తగా గుజ్జులా మారిపోయే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అందులో పంచదార, నెయ్యి వేసుకుని.. పంచదార కరిగిన వెంటనే ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఈలోపు బ్రెడ్‌ స్లైస్‌ని నాలుగువైపులా బ్రౌన్‌ కలర్‌ పీస్‌ని కట్‌ చేసి తీసేసి.. మిగిలిన బ్రెడ్‌ స్లైస్‌ని ఒకసారి చపాతీలా ఒత్తుకోవాలి.

ఇప్పుడు ప్రతి బ్రెడ్‌ స్లైస్‌లోనూ కొద్దికొద్దిగా బనానా మిశ్రమాన్ని వేసుకుని.. రోల్స్‌లా చుట్టుకుని.. తడిచేత్తో అంచుల్ని అతికించుకోవాలి. ఫోర్క్‌ సాయంతో కొనలను నొక్కి, బాగా అతికించుకోవాలి. మిగిలిన బటర్‌తో వాటిని ఇరువైపులా వేయించుకుని సర్వ్‌ చేసుకోవాలి. 

>
మరిన్ని వార్తలు