Jawan Bongu Babu Rao: నా భర్తకు ఈ గుర్తింపు లభించడం సంతోషం

25 Sep, 2021 09:16 IST|Sakshi

Sakshi Excellence Awards: దేశ సేవకు అంకితమై.. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన అమర జవాను బాబూరావుకు ‘సాక్షి’ నివాళి అర్పించింది. వీర సైనికుడి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డు(‘మరణానంతర’ పురస్కారం)’ను ప్రకటించింది. హైదరాబాద్‌లో సెప్టెంబరు 17న జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న అమర జవాను సతీమణి ప్రియ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

వీర జవాను బాబూరావు ‘మరణానంతర’ పురస్కారం
కుటుంబాలకు దూరంగా అనుక్షణం ప్రమాదపుటంచుల్లో విధులు నిర్వర్తిస్తూ భరతమాత రక్షణకు తమ జీవితాలను అంకితం చేస్తారు జవాన్లు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన బాబూరావు కూడా పాతికేళ్ల ప్రాయంలోనే అస్సాం రైఫిల్స్‌ లో చేరారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేతలో పాల్గొన్నారు బాబూరావు. అక్కడ టెర్రరిస్టులకు, జవాన్లకు మధ్య జరిగిన భీకర పోరులో తీవ్రగాయాలు పాలై అమరుడయ్యారు. అంతకు ఎనిమిది నెలల ముందే బాబూరావుకు వివాహం అయింది. 

దేశం కోసం.. పురస్కారం
సైనికునిగా దేశానికి అందించిన సేవలకు, త్యాగానికి గాను నా భర్తకు ఈ గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. సాక్షికి ధన్యవాదాలు. 
–ప్రియ, అమర జవాన్‌ బాబూరావు సతీమణి
చదవండి: స్ఫూర్తి ప్రదాతలకు.. సాక్షి పురస్కారాలు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు