Apple Carrot Orange Juice: యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్స్‌ పుష్కలం.. ఒక్కసారి తాగారంటే!

22 Apr, 2022 07:34 IST|Sakshi

యాపిల్‌ క్యారట్‌ ఆరెంజ్‌ జ్యూస్‌ 

Apple Carrot Orange Juice Recipe Health Benefits- యాపిల్‌ క్యారట్‌ ఆరెంజ్‌ జ్యూస్‌లో విటమిన్‌ సి, ఏ, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్స్‌ పుష్కలంగా ఉండి ఫ్రీ రాడికల్స్‌పై పోరాడతాయి. క్యారట్, యాపిల్, ఆరెంజ్‌లు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మండే ఎండల్లో ఈ జ్యూస్‌ తియ్యగా, పుల్లని రుచితో ఉండి దాహార్తిని తీరుస్తుంది.   

కావలసినవి: క్యారట్స్‌ – రెండు, యాపిల్స్‌ – రెండు, ఆరెంజెస్‌ – మూడు, నీళ్లు – కప్పు, అల్లం రసం – అరటీస్పూను, పసుపు – పావు టీస్పూను, మిరియాల పొడి – పావు టీస్పూను, ఐస్‌ ముక్కలు – నాలుగు. 

తయారీ: క్యారట్స్, యాపిల్స్‌ను తొక్క, గింజలు తీసి ముక్కలుగా తరగాలి.
ఆరెంజ్‌లను తొక్కతీసి జ్యూస్‌ తీసుకోవాలి.
క్యారట్‌ ముక్కలను బ్లెండర్‌లో వేయాలి.
దీనిలో ఆరెంజ్‌ జ్యూస్‌ వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
క్యారట్‌ గ్రైండ్‌ అయ్యాక యాపిల్‌ ముక్కలు, అల్లం రసం, పసుపు, మిరియాలపొడి, నీళ్లు పోసి మరోసారి చక్కగా గ్రైండ్‌ చేసుకుని గ్లాసులో పోసుకోవాలి.
దీనిలో కొద్దిగా ఐస్‌ ముక్కలను వేసుకుని తాగితే జ్యూస్‌ చాలా బావుంటుంది.

చదవండి: Poha Banana Shake: ఫైబర్‌, ఐరన్‌ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్‌ తాగితే!

మరిన్ని వార్తలు