టమాటా ధర పెరిగిందని టెన్షన్‌ వద్దు.. ఆ లోటుని ఇలా భర్తీ చేయండి!

30 Jun, 2023 13:58 IST|Sakshi

ప్రస్తుతం కూరగాయాల ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఏం కొనలేం తినలేం అన్నట్లు ఉంది పరిస్థితి. గడిచిన నెలలో ఎండల తీవ్రత.. దీనికి తోడు అకాల వర్షాలు..వీటన్నింటి కారణంగా సరైన దిగుబడి లేకుండా పోయింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో దిగుమతులు కూడాలేవు. దీంతో మొన్నటి వరకు సాధారణ స్థితిలో ఉన్న కూరగాయాల ధరలు కాస్తా ఒకేసారి సామాన్యుడు కొనలేనంతగా పైకి ఎగబాకాయి.

అందులోనూ.. టమాట ధర సెంచరీ కొట్టేసింది. మొన్నటి వరకు కిలో రూ. 20, రూ. 40గా ఉన్నాయి వంద రూపాయాలు పైనే పలుకుతోంది. అన్ని కూరల్లోనూ గ్రేవీ కోసం టమాటాలను విరివిగా వాడటం సర్వసాధారణం. అలాంటిది ఇప్పుడూ కొనాలన్నా, ఉపయోగించాలన్న ఆలోచించాల్సిన స్థితి. టమాట వేస్తే ఆ కూర రుచే వేరే.

ఆఖరికి రెస్టారెంట్లు, హోటళ్ల వాళ్లు సైతం కస్టమర్లకు గ్రేవీతో కూడిన కూర సర్వ్‌ చేయాలంటే.. అక్కడ  పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కానీ గృహణులు ఇలాంటి సమయంలోనే తమ పాక శాస్త్ర ప్రావిణ్యాన్ని వెలికితీసి టమాటాకే డౌటు తెప్పించే రుచిగా వండాలి. ఈ ప్రత్యామ్నాయాలతో ఆ కొరతను భర్తీ చేసుకుంటూ టమాటా లాంటి రుచిని తెప్పించి చూపించ్చొఉ. అందుకు కాస్త తెలివిని ఉపయోగిస్తే చాలు. ఇంతకీ అవేమిటో చూద్దామా!.

టమాటాలకు అల్ట్రనేటివ్‌గా వేటిని ఉపయోగించాలంటే..
టమాటా వేయగానే కాస్త పులుపు తీపి మిక్సింగ్‌లతో కూర రుచి అదిరిపోతుంది కదా. దాని ప్లేస్‌లో చింతపండును చక్కగా ఉపయోగించవచ్చు. అది కూడా కూరకు సరిపడగా పులుపు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడితే  ఆ కూర రుచి అదర్స్‌ అనే చెప్పాలి.

మార్కెట్లో దొరికే టమాటో పేస్ట్‌తో కూడా ఆలోటును సులభంగా భర్తి చేసుకోవచ్చు. తాజా టమాటాలు అందుబాటులో లేనప్పుడూ, కొనలేని స్థితిలో ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఇవి మార్కెట్లో కూడా సరసమైన ధరలోనే అందుబాటులో ఉంటాయి. 
ఇక రెడ్‌ బెల్‌ పెప్పర్‌ కూడా టమాటా మాదిరిగా కూరకు రుచిని ఇవ్వగలదు. పైగా కూర మంచి కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. 

ఇంకోకటి ఆలివ్‌లు వీటిని ఉడికించి లేదా నేరుగా ఉపయోగించవచ్చు. పండిన ఆలివ్‌లు అయితే టమాటకు బెస్ట్‌ ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు
అలాగే ఉసిరి కూడా మంచి పులుపు వగరుతో కూడిని స్వీట్‌ని అందిస్తుంది. దీనిలో ఫైబర్, ఐరన్ సమృద్ధిగా  ఉంటాయి. అంతేగాదు దీనిలో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కారణంగా క్యాన్సర్-నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న ఆకుపచ్చ ఉసిరికాయ ఆకుపచ్చ టమాటాలను గుర్తుకు తెచ్చే పుల్లని రుచిని అందిస్తుంది.

గృహుణులు ఇలాంటి ప్రత్నామ్నాయ చిట్కాలతో టమాటాకు ప్రత్యామ్నాయంగా వాడటం తోపాటు కుటుంబసభ్యులందరికి ఆరోగ్యకరమైన భోజనం పెట్టినవాళ్లం అవుతాం. సో మహిళలు మేథస్సు మన సోంతం. తెలివిగా ఇలాంటి చిట్కాలతో పెరుగుతున్న ధరలకు చెక్‌పెట్టేలా ఇలా ఇంటిని చక్కబెట్టుకోండి. 
(చదవండి: మసాల మజ్జిగా ఇలా ట్రై చేస్తే..మైమరిచి తాగేస్తారు)

మరిన్ని వార్తలు