Face Mask Therapy: క్షణాల్లో ఫేస్‌మాస్క్‌ను రెడీ చేసే మెషీన్‌.. కొరియన్లు చేసేది ఇదే

9 Oct, 2023 10:35 IST|Sakshi

నిజానికి ఫేస్‌ మాస్క్‌లతో స్కిన్‌ కేర్‌ పొందడం మంచి ప్రయత్నమే. కానీ వాటిని సిద్ధం చేసుకోవడమే కష్టం. ఆ కష్టాన్ని సులభతరం చేస్తుంది ఈ లేటెస్ట్‌  ఫేస్‌ మాస్క్‌ డివైస్‌. ఇంట్లో తయారు చేసుకునే సాధారణ ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటే.. అప్లై చేసుకునే సమయంలో ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువవుతుంది. కొన్నిసార్లు సగం ఆరి.. సగం ఆరక ఇబ్బందవుతుంది. గుజ్జుమెత్తగా లేకుంటే ఉండాల్సిన సమయం కంటే ముందే రాలిపోతుంది.

ఇలా ఒక్కటని కాదు.. ఫేస్‌ మాస్క్‌ విషయంలో అన్నీ సమస్యలే. అదే ఈ మెషిన్‌తో తయారైన మాస్క్‌ని క్లాత్‌ మాదిరి పట్టుకుని.. ముఖంపై సమాంతరంగా సులభంగా పరచుకోవచ్చు. పైగా ఈ మెషిన్‌ని మనం క్లీన్‌ చెయ్యాల్సిన పనిలేదు. సెల్ఫ్‌ క్లీనింగ్‌ మోడ్‌ ఆన్‌ చేస్తే పది సెకన్లలో క్లీన్‌ అయిపోతుంది. దీనికి చార్జింగ్‌ పెట్టుకుని.. వైర్‌లెస్‌గా వాడుకోవచ్చు.

ఎన్ని నీళ్లు పొయ్యాలి.. ఇన్‌గ్రీడియెంట్స్‌ ఏ మోతాదులో కలపాలి.. అనే సూచనలను వాయిస్‌ మోడ్‌లో ఇస్తూంటుంది ఈ మేకర్‌. అవసరం లేదనుకుంటే వాయిస్‌ రిమైండర్‌ ఆపేసుకోవచ్చు. ఇది సరిగ్గా రెండు నిమిషాల్లో మాస్క్‌కి కావాల్సిన పేస్ట్‌ని సిద్ధం చేస్తుంది. ఇందులో కూరగాయలు, పండ్లు, విటమిన్‌ టాబ్లెట్స్‌ వంటివి పేస్ట్‌లా చేసుకోవచ్చు. దీని ధర సుమారుగా 6 వేలరూపాయల పైమాటే.

మాస్క్‌ ప్లేట్స్‌ని బట్టి.. అందులో లిక్విడ్‌ వేయగానే ఆయా షేప్‌ మాస్క్‌లు సిద్ధమవుతాయి. కళ్లు, ముక్కు, పెదవులకు ఇబ్బంది లేకుండా రూపొందిన ఫేస్‌ షేప్‌లో ఉండే ప్లేట్‌తో పాటు.. కళ్లు, ముక్కు, పెదవుల ఆకారంలో ఉండే ప్లేట్స్‌ కూడా డివైస్‌తో పాటు లభిస్తాయి. ఈ సౌకర్యాలన్నింటిని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.  

మరిన్ని వార్తలు