Fact Check : ఈ స్కీం కింద రూ.24వేలు వస్తాయా? అందులో నిజమెంత?

13 Jul, 2021 11:52 IST|Sakshi

కేంద్రం "ప్రధాన్‌ మంత్రి కన్యా ఆశీర్వాద్‌" పేరుతో కేంద్రం మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం అమలులో భాగంగా సంవత్సరానికి రూ.24వేలు, నెలకు రూ. 2వేలు చొప్పున అందిస్తున్నట్లు ఓ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది.  

ఆ పోస్ట్‌లో 5 సంవత్సరాల నుంచి 18సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఆడపిల్లలు పోస్టాఫీసుల్లో పథకాన్ని అప్లయ్‌ చేసుకోవాలని, అందుకు తెల్లరేషన్‌ కార్డ్‌ను అర్హతగా పరిగణలోకి తీసుకుంటారని పోస్ట్‌లో హైలెట్‌ అయ్యింది. అయితే ఈ పోస్ట్‌ను ఫ్యాక్ట్‌ చెక్‌ లో పరిశీలించగా కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఈ కొత్త పథకం లేదని తేలింది. ఇదే విషయాన్ని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫిబ్రవరి 10,2020న  కన్ఫామ్‌ చేసింది.  అంతేకాదు కేంద్ర మినిస్ట్రీ  ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ చైల‍్డ్‌ డెవలప్‌ మెంట్‌ శాఖ అధికారిక సైట్‌ లో పరిశీలించగా.. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో 15 మాత్రమే ఉన్నట్లు తేలింది.  

దీంతో ప్రధాన్‌ మంత్రి కన్యా ఆశీర్వాద్‌ పేరుతో వైరల్‌ అవుతున్న పోస్ట్‌ ఫేక్‌ అని తేటతెల్లమైంది. కాబట్టి ఇలాంటి పుకార్లను ప్రజలెవరూ నమ్మోద్దని పీఐబీ విజ్ఞప్తి చేస్తూ తన పోస్ట్‌లో పేర్కొంది.     


 

మరిన్ని వార్తలు