కొలువుల కోసం కొత్త విధానాలు

27 Aug, 2020 00:55 IST|Sakshi

సందర్భం

ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది దాకా అభ్యర్థులు పరీక్షలు  రాస్తారు. వీరు 1.25 లక్షల ఉద్యోగాల కోసం పలు రకాల పరీక్షలను రాస్తున్నారు. అయితే వచ్చే సంవత్సరం నుంచి ఈ బాధ వుండదు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్‌ ఇటీవలే ఆమోదించిన జాతీయ ఉద్యోగ నియామక ఏజెన్సీ ఏర్పాటు కోట్లాదిమంది యువతకు ఒక వరం లాంటిది. కింది స్థాయి ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వూ్యలను తొలగించడమే కాకుండా కాలం చెల్లిన పురాతనమైన 1,500 నిబంధనలు, చట్టాలను రద్దు చేశారు. ఇకపై ఉమ్మడి అర్హతా పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ నియామకాల్లో విప్లవాత్మక సంస్కరణకు ఈమధ్యనే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆ సంస్కరణ జాతీయ ఉద్యోగ నియా మక ఏజెన్సీ (నేషనల్‌ రిక్రూట్‌ మెంట్‌ ఏజెన్సీ–ఎన్‌ఆర్‌ఏ)ని ఏర్పాటు చేయ డానికి సంబంధించినది. ఆమోదిం చిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ.. దేశంలోని యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సంస్కరణ దేశంలోని కోట్లాదిమంది యువతకు ఒక వరంలాంటిదని అన్నారు. అంతేకాదు ఈ సంస్కరణ కారణంగా పలు పరీక్షలు రాసే శ్రమ తప్పుతుందని, విలువైన సమయం, వనరులు ఆదా అవుతాయని అన్నారు. ఆయన మరోమాట కూడా అన్నారు. ఎన్‌ఆర్‌ఏను ఏర్పాటు చేయడమనేది పారదర్శకతను బలోపేతం చేస్తుందని... పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన మైన విధానమని మోదీ అన్నారు. 

పలు సంస్థల వ్యవస్థగా రూపొందిన జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఏ) ఒక ఉమ్మడి అర్హతాపరీక్ష (కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌– సీఈటీ)ను నిర్వహిస్తుంది. దీనిద్వారా గ్రూప్‌ బి, సి (నాన్‌ టెక్నికల్‌) ఉద్యోగాల భర్తీకోసం కావలసిన అభ్యర్థులను వడపోస్తారు. రైల్వేలు, ఆర్థికశాఖ, ఎస్‌ఎస్సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌ల నుంచి ప్రతినిధులు ఎన్‌ఆర్‌ఏలో వుంటారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంపా దించాలంటే పలు సంస్థలు నిర్వహించే పలు రకాల పరీక్షలను ఉద్యో గార్థులు రాయాల్సి ఉంటుంది. సరాసరి తీసుకుంటే ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది దాకా అభ్యర్థులు పరీక్షలు  రాస్తారు. వీరు 1.25 లక్షల ఉద్యోగాల కోసం ఈ పరీక్షలను రాస్తున్నారు. అయితే వచ్చే సంవత్సరం నుంచి ఈ బాధ వుండదు. ఎన్‌ఆర్‌ఏ ఉమ్మడి అర్హతా పరీక్ష(సీఈటీ)ను నిర్వ హిస్తుంది. సీఈటీ మార్కుల ఆధారంగా అభ్యర్థులు ఆయా సంస్థల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది దేశంలోని లక్షలాది మంది ఉద్యోగార్థుల జీవితాలను సంతోషపెట్టే ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. ఈ మార్పు కారణంగా వారి సమయం, వన రులు ఆదా అవుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఎవరూ ఊహించని అసాధారణమైన సంస్కరణలను తెచ్చాము. గతంలో డాక్యుమెంట్లను గెజిటెడ్‌ ఆఫీసర్‌ అటెస్ట్‌ చేసేవారు. ఆ విధానాన్ని తొలగించి సెల్ఫ్‌అటెస్టేషన్‌ ప్రవేశ పెట్టాం. కింది స్థాయి ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వూ్యలను తొలగిం చడమే కాకుండా కాలం చెల్లిన పురాతనమైన 1,500 నిబంధనలు, చట్టాలను రద్దు చేశాం.

ఐఏఎస్‌ అధికారులు తమ కెరీర్‌ ప్రారంభంలో మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వంలో సేవలందించాలని నియమం పెట్టాం. అవినీతి నిరోధక చట్టంలో సవరణ తీసుకొచ్చాం. ప్రధాని ఎక్సలెన్స్‌ అవార్డుల కోసం కొత్త ఫార్మాట్‌ను రూపొందించాం. ఇదే వరుసలో ముందుకొచ్చిన ఎన్‌ఆర్‌ఏ ఒక విశిష్టమైన విధానం. ప్రభుత్వ ఉద్యో గాల నియామక ప్రక్రియలో ఒక ప్రాథమికమైన మార్పుగా దీన్ని పేర్కొనవచ్చు. ఉద్యోగాల కోసం కృషి చేస్తున్న యువత ఒడిదుడు కులు లేకుండా జీవించాలనేది మోదీ ప్రభుత్వవిధానం. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగాల నియామక విధానాన్ని, ఎంపిక, ఉద్యోగ కేటా యింపును సరళతరం చేసింది. ఇంతవరకు ఉన్న పలు నియామక పరీక్షలనేవి అభ్యర్థులకు భారంగా మారాయి. ఉద్యోగులను ఎంపిక చేసే సంస్థలపైన కూడా ఇది భారంగా పరిణమించింది. ఖర్చులు, శాంతి భద్రతల సమస్య, పరీక్షా కేంద్రాల ఎంపిక మొదలైన సమ స్యలు ఆందోళన కలిగించేవి. అందువల్ల అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బం దులు కలిగించకుండా, వారికి అనుకూలంగా, తక్కువ వ్యయంతో ఉద్యోగ నియామకాలు చేయడానికి ఎన్‌ఆర్‌ఏను ఏర్పాటు చేశాం. 

సులువుగా పరీక్ష కేంద్రాల అందుబాటు
దేశవ్యాప్తంగా ప్రతిజిల్లాలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంవల్ల అవి మారుమూల ప్రాంత అభ్యర్థులకు సైతం పూర్తిస్థాయిలో అందు బాటులోకి వస్తాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా 117 జిల్లాల్లో పరీక్ష లకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ సదుపాయాల కారణంగా ఈ జిల్లాల్లోని అభ్యర్థులు తమ నివాసానికి సమీపంలోనే పరీక్షలకు హాజరు కావచ్చు. ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయం కొండప్రాంతాల్లో, గ్రామీణ, మారు మూల ప్రాంతాల్లో నివసించే కోట్లాదిమంది ఉద్యోగార్థులకు వరంలా మారింది. ఈ నిర్ణయం ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు మరింత ప్రయోజనకరం. ఎందుకంటే వివిధ కేంద్రాల్లో వివిధ సమయాల్లో ఈ పరీక్షలను రాయాలంటే మహిళా అభ్యర్థులు అనేక సమస్యలను ఎదు ర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు వారికి ఖర్చులు, శ్రమ తగ్గడమే కాకుండా వారికి తగిన భద్రత కూడా లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలను ప్రజ లకు అందుబాటులోకి తేవడానికి తీసుకున్న ఈ నిర్ణయం సాహసో పేతమైనది.

ఇది దేశంలోని యువత జీవనాన్ని సరళతరం చేస్తుంది. గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కోసం మాక్‌టెస్ట్‌ నిర్వహిస్తారు. అంతేకాదు 24/7 హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేస్తు న్నారు. సీఈటీలో వచ్చిన మార్కులు మూడేళ్లపాటు పరిగణనలోకి తీసుకుంటారు. ఒక అభ్యర్థి ఎన్నిసార్లయినా పరీక్షలు రాయవచ్చు. పరీక్ష ఫలితాలు వచ్చిన తేదీ నుంచి మూడేళ్లపాటు ఆ మార్కులకు విలువ వుండేలా చేయాలనుకోవడం ఇందులో ఒక గొప్ప అంశం. గరిష్ట వయోపరిమితికి లోబడి ఒక అభ్యర్థి ఎన్నిసార్లయినా పరీక్షలు రాసుకోవచ్చు. వాటిలో ఉత్తమమైన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అమలులో వున్న ప్రభుత్వ విధానం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇంకా ఇతర కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయో పరిమి తిలో సడలింపు ఇస్తారు కూడా. కాబట్టి ఎన్‌ఆర్‌ఏ అనేది అభ్యర్థులు ఇంతకాలం పడుతున్న కష్టాలను తగ్గిస్తుంది. అంతేకాదు వారి సమ యాన్ని, డబ్బును ఆదా చేస్తుంది. 

ప్రామాణికంగా పరీక్షలు
గ్రాడ్యుయేషన్, హయ్యర్‌ సెకండరీ (12వ తరగతి పాస్‌), మెట్రిక్యు లేషన్‌ (10వ తరగతి పాస్‌) ఈ మూడు స్థాయిల అభ్యర్థులకు ప్రత్యే కంగా సీఈటీ వుంటుంది. ఈ అభ్యర్థుల కోసం ప్రస్తుతం స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్సీ) రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(ఆర్‌ఆర్‌బీ), బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐబీపీఎస్‌) సంస్థలు పరీక్షలు నిర్వ హిస్తున్నాయి. ఇవి ఇకముందు ఉండవు. సీఈటీ స్థాయిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను విభాగాలుగా వర్గీకరించి తుది ఎంపికకు పంపుతారు. తుది ఎంపిక కోసం పరీక్షలను సంబంధిత నియామక సంస్థలు నిర్వహిస్తాయి. సీఈటీ కోసం పాఠ్యప్రణాళిక ఉమ్మడిగా వుంటుంది. ప్రామాణికంగా వుంటుంది. ఇంతకాలం వివిధ పాఠ్యప్రణాళికలతో ఆయా ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా తయారయ్యే అభ్యర్థులకు ఇకముందు ఆ ఇబ్బంది వుండదు. పరీక్ష కేంద్రాల ఎంపి కలో, పరీక్షల నిర్వహణలో సరళీకరణ సీఈటీ కోసం దరఖాస్తు చేసు కునే అభ్యర్థులు తమ పేర్లను ఉమ్మడి పోర్టల్‌లో నమోదు చేసుకో వచ్చు. అంతేకాదు తమకు అనువైన పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసు కోవచ్చు. అందుబాటునుబట్టి వారికి కేంద్రాలను కేటాయిస్తారు. ప్రభుత్వ అంతిమ ఉద్దేశం ఏంటంటే అభ్యర్థులు తమకు అనుకూల కేంద్రాల్లో పరీక్షలు రాయడం. 

బహుళభాషల్లో అందుబాటులోకి వస్తున్న సీఈటీ
పలు భాషల్లో సీఈటీ రాయవచ్చు. దీని కారణంగా దేశవ్యాప్తంగా పలు భాషలు మాట్లాడే అభ్యర్థులు పరీక్షలు రాయవచ్చు. ఎంపిక అయ్యే అవకాశాలు దేశంలో అందరికీ సమానంగా ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు పన్నెండు భాషల్లో సీఈటీ నిర్వహించడానికి ప్రయ త్నిస్తున్నాం. రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన అన్ని భాషల్లో సీఈటీ నిర్వహించడానికి ముందు ముందు ప్రయత్నాలు చేస్తారు కూడా. సీఈటీలో వచ్చే మార్కులను మొదటగా మూడు ప్రధా నమైన రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు ఉపయోగించుకుంటాయి. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర నియా మక సంస్థలు కూడా వీటిని ఉపయోగించుకుంటాయి. మరికొంత కాలం తర్వాత పబ్లిక్, ప్రైవేట్‌ రంగంలోని ఇతర సంస్థలు కూడా వారికి అవసరమనుకుంటే ఈ సీఈటీని ఉపయోగించుకోవచ్చు. సహ కార సమాఖ్య విధానం అసలైన స్ఫూర్తిని ప్రతిఫలించేలా సీఈటీ మార్కులను కేంద్ర ప్రభుత్వంలోని ఇతర నియామక సంస్థలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లోని నియామక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఉపయోగించుకోవడం జరుగుతుంది.

డాక్టర్‌ జితేంద్రసింగ్‌
కేంద్ర సహాయమంత్రి 

మరిన్ని వార్తలు