రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌కు ‘కంతేరు’ ప్రాజెక్టు

11 Nov, 2023 01:42 IST|Sakshi
విద్యార్థులను అభినందిస్తున్న హెచ్‌ఎం పద్మావతి, ఉపాధ్యాయులు

కంతేరు(తాడికొండ): రాష్ట్ర స్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌కు తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు రూ పొందించిన ప్రాజెక్టు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం టి.పద్మావతి తెలిపారు. జిల్లాస్థాయి 31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రాజెక్టుల సందర్శన గుంటూరులోని డీసీఈబీ హాలులో ఈ నెల 9వ తేదీ నిర్వహించిన ప్రదర్శనకు జిల్లా వ్యాప్తంగా వంద ప్రాజెక్టులు నమోదు కాగా అందులో 84 ప్రాజెక్టులు ప్రదర్శించినట్లు చెప్పారు. అందులో ఏడు ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయగా ఎంపికై న ప్రాజెక్టులలో మా స్కూల్‌కు అవకాశం దక్కడం గర్వకారణంగా పేర్కొన్నారు. 9వ తరదతి చదువుతున్న విద్యార్థి మారెళ్ల శ్రీకాంత్‌, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎం.ధనయ్య గైడ్‌ టీచర్‌ ఆధ్వర్యంలో తాగునీటిలో ఫ్లోరైడ్‌ శాతం తగ్గించడం ద్వారా మానవునిలో దంతాలు, ఎముకలు క్షీణిత నివారణపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు అందరినీ ఆకట్టుకొని రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికై ందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికై న విద్యార్థి మారెళ్ళ శ్రీకాంత్‌, ఉపాధ్యాయుడు ఎం.ధనయ్యను హెచ్‌ఎం పద్మావతి అభినందించారు.

మరిన్ని వార్తలు