జగనన్న పాలనలోనే సాధికారత

21 Nov, 2023 02:08 IST|Sakshi
మీడియా సమావేశంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, కారుమూరి

సంక్షేమానికి

శక్తి వంచన లేకుండా కృషి

నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ప్రజల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు వ్యాఖ్యానించారు. 76 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో బలహీనవర్గాలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారని, ఎంతో అణిచివేతకు గురయ్యరని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో వృద్ధి చెందారని వివరించారు. ఉన్నత వర్గాల పిల్లలు మాత్రమే ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలన్న ప్రతిపక్షాల కుట్రలను ఛేదించి ప్రతి పేదింటి బిడ్డకూ నాణ్యమైన చదువులు అందించిన ఘనత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానిదేనన్నారు.

బీసీలకు అండగా నిలిచిన జగన్‌

గత ప్రభుత్వాలు బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వినియోగించుకున్నాయని, వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ చెప్పారు. జగన్‌ ప్రభుత్వంలో బీసీల అభ్యున్నతికి విశేష కృషి జరిగిందని వివరించారు. వైఎస్సార్‌ తన హయాంలో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి వాటితో రెండు అడుగులు ముందుకు వేస్తే జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేసి మైనార్టీలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారన్నారు. మైనార్టీలకు ఇంత కన్నా ఎక్కువ మేలు చేసిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు. అందుకే మైనార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నకు అండగా నిలుస్తున్నామన్నారు.

సాక్షి, నరసరావుపేట: సామాజిక సాధికారతను ఆచరణలో చూపిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. వైఎస్సార్‌ సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా సోమవారం నరసరావుపేట ఏ–1 ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో కలసి ఆదిమూలపు మాట్లాడారు. సామాజిక సాధి కార యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. మళ్లీ వైఎస్సార్‌ సీపీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 2019లో రాష్ట్ర ప్రజలు తీసుకున్న మంచి నిర్ణయం వల్ల ఇప్పుడు ఫలితాలు అను భవిస్తున్నామని, బలహీన వర్గాలు మరింత అభివృద్ధి చెందాలంటే జగనన్న మళ్లీ సీఎం కావాలన్నారు.

మాటపై నిలబడే వ్యక్తి జగన్‌ : కారుమూరి

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. జగనన్న పాలనలో బీసీలకు అధిక పదవులు దక్కాయన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమన్నారు. కేబినెట్‌ పదవుల్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన ఘనత ఒక్క జగన్‌దేనన్నారు. జగనన్న పాలనలో నలుగురు బీసీలకు రాజ్యసభ పదవులు దక్కాయన్నారు. గతంలో 11 శాతానికిపైగా ఉన్న పేదరికం జగన్‌ పాలనలో ఏకంగా ఆరు శాతానికి తగ్గిపోయిందన్నారు. జీడీపీలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామంటే ఇది కాదా అభివృద్ధి అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.

సాధికారతకు నిజమైన నిర్వచనం జగన్‌ పాలన

సమానత్వం, సాధికారత అనే పదాలకు నిజమైన నిర్వచనం వైఎస్సార్‌ సీపీ పాలన అని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాదరావు అన్నారు. విద్య, వైద్య ప్రమాణాలు పెంచి వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేనన్నారు. ఈ ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రజలకు వివరించేందుకు వచ్చామని పేర్కొన్నారు. అందరం కష్టించి మళ్లీ వైఎస్‌ జగన్‌ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు