ఒక్క పెయింటింగ్‌ ధర రూ. 450 కోట్లు.. ప్రత్యేకత ఇదే!‌

25 Mar, 2021 13:40 IST|Sakshi

అబుదాబి: ప్రపంచవ్యాప్తంగా పెయింటింగ్‌లకు ఎంతో విలువ ఉంటుంది. పెయింటింగ్ అంటే పడిచచ్చే వాళ్లు వాటి కోసం ఎంత డబ్బైయిన వెచ్చించి తమ సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలో వాటి ధర కోట్లలో పలికి.. అమ్ముడు పోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా వేలంలో ఓ పెయింట్‌ కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోయింది. ఏకంగా రూ. 62 మిలియన్‌ డాలర్లకు(భారత కరెన్సీలో రూ. 450 కోట్లు) అమ్ముడు పోయి ప్రపంచలోనే అత్యంత వీలువైన పెయింటింగ్‌గా గుర్తింపు పొంది గిన్నిస్‌ రికార్టుకెక్కింది. ఈ పెయింటింగ్‌ను బ్రిటిష్‌ చిత్రకారుడు సచా జాఫ్రీ వేశాడు. 

అయితే అతడు వేసిన ఈ పెయింటింగ్‌ విశేషం ఏంటో ఓ సారి చుద్దాం. ప్రముఖ బ్రిటిష్‌ పెయింటరైన‌ సచా జాఫ్రీ దీనిని దుబాయ్‌లో రూపొందించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్యాస్‌ పెయింటింగ్‌గా పెరొందిన దీనిని 17, 176 చదరపు అడుగుల మేర వేశాడట. అంటే ఇది 6 టెన్నిస్‌ కోర్టులతో సమానం. దీంతో ఈ పెయింటింగ్‌ను మొత్తం 70 భాగాలు విభజించి దుబాయ్‌లో వేలం వేయగా 450 రూపాలయ కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.

మనుషుల జీవన మనుగడను ప్రతిబించే ఈ పెయింటింగ్‌ను ‘జర్నీ ఆఫ్‌ హుమానిటీ’ పేరుతో జాఫ్రీ దీనిని రూపొందించాడు. అయితే దీనిని గీసేందుకు అతడికి 1065 పెయింటింగ్‌ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింటింగ్‌ పట్టిందట. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్‌గా గిన్నిస్‌బుక్‌ నిర్వాహక అధికారులు ధృవీకరించారు. అంతేగాక రికార్డుకు సంబంధించిన పత్రాన్ని ఆర్టిస్ట్‌ జాఫ్రీకి నిర్వాహకులు అందిచారు.  ఈ పెయింటింగ్‌ను ఫ్రెంచ్‌కు చెందిన ఆండ్రీ అబ్దున్ అనే వ్యాపార వేత్త వేలం పాటలో రూ.450 కోట్లకు దక్కించుకోవడం విశేషం.

చదవండి: 
చైతో ఇదే సమస్య.. దాని కోసం తరచూ వాదన: సామ్
వందల ఏళ్ల తర్వాత విస్ఫోటనం.. ఆమ్లెట్‌ వేసిన సైంటిస్టులు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు