New Zealand: కొట్టుకువచ్చిన... 500కి పైగా భారీ తిమింగలాలు

11 Oct, 2022 13:08 IST|Sakshi

న్యూజిలాండ్‌లోని మారమూల చతం దీవుల్లోకి దాదాపు 500పైగా చనిపోయిన తిమింగలాలు కొట్టుకు వచ్చాయి. ఐతే ఆ ప్రాంతంలో ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టలేమని మెరైన్‌ బృదం తెలిపింది. మొదటగా ఆ బీచ్‌లో 250 తిమింగలాలు కొట్టుకువచ్చాయని ఆ తర్వాత మూడు రోజులకు 240కి పైగా కొట్టుకువచ్చాయిని అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతంలో రెస్క్యూ చర్యలు చేపట్టడం చాలా కష్టం అని అధికారులు న్యూజిలాండ్‌ ప్రభుత్వ సాంకేతిక సలహదారుడు లండ్‌ క్విస్ట్‌కి చెప్పారు. ఆ బీచ్‌లో ఒకటి రెండు తిమంగలాలు ఉంటే పర్లేదు కానీ  ఏకంగా వందల సంఖ్యలో కొట్టుకు వచ్చాయని అందువల్ల అసాధ్యం అని చెప్పారు. పైగా తిమంగలాలు భారీగా ఉంటాయి. అవి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పుడూ ఏ క్షణమైన పేలిపోవచ్చు అందవల్ల వాటిని అలానే వదిలేయాలని అధికారులు నిర్ణయించారు.

అవి అలా సహజ సిద్ధంగా కుళ్లిపోవడమే మంచిదని అధికారులు నిర్ణయించారు. ఇలానే 1918లో సుమారు ఒక వెయ్యి తిమింగలాలు సాముహికంగా చనిపోయి కొట్టుకువచ్చినట్లు తెలిపారు. ఇలా ఆకస్మాత్తుగా వందల సంఖ్యలో తిమింగలాలు చనిపోయి ఎందుకు కొట్టుకు వస్తాయనేది తెలియడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అదీగాక అధికారిక గణాంకాల ప్రకారం న్యూజిలాండ్‌లో ఏడాదికి సుమారు 300 సముద్ర జీవులు సాముహికంగా చనిపోయి కొట్టుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

(చదవండి: కిమ్‌ రూటే సెపరేట్‌: క్షిపణి ప్రయోగం చేసిన స్థావరంలోనే..)

మరిన్ని వార్తలు