భారత్‌పై నిషేధం: నిర్మోహమాటంగా కోర్టు నిరాకరణ

10 May, 2021 18:19 IST|Sakshi

సిడ్నీ: ఏడాదిన్నర కిందట భారతదేశానికి వచ్చిన ఓ ఆస్ట్రేలియన్‌ వ్యక్తి ఇప్పుడు కర్నాటకలోని బెంగళూరులో ఒంటరిగా ఉంటున్నాడు. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చేవారిపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అందులో భాగంగా ఆస్ట్రేలియా కూడా ఇటీవల భారతదేశం నుంచి వచ్చేవారిపై కఠిన ఆంక్షలు విధించింది. అసలు భారత్‌ నుంచి వచ్చేవారిని నిషేధించింది. ఈ నిషేధంపై ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో వివాదం కొనసాగింది. సిడ్నీలోని కోర్టులో భారతేదశం నుంచి మన పౌరులను అనుమతించాలని చేస్తూ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 

దీంతో భారత్‌లో చిక్కుకున్న 79 ఏళ్ల వ్యక్తి ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. దేశ ఆరోగ్యం దృష్ట్యా.. వైద్యాధికారుల సిఫారసు మేరకు భారతీయుల రాకపై నిషేధం విధించినట్లు మరోసారి న్యాయస్థానం స్పష్టం చేసింది. కర్నాటకలోని బెంగళూరులో తమ దేశానికి చెందిన వ్యక్తి చిక్కుకునిపోయాడని.. ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చేందుకు పరిస్థితులు అడ్డంకిగా మారాయని సిడ్నీలోని కోర్టులో న్యాయవాది పిటిషన్‌ వేశాడు. దీనిపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలోకి ఎవరినీ రానివ్వం అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ వచ్చేందుకు ప్రయత్నిస్తే 66 వేల డాలర్ల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది.

చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ
చదవండి: రాజకీయాల్లో చిచ్చురేపిన అల్లుడి పెళ్లి బరాత్‌ 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు