పొట్టు పొట్టు చినిగిన నాశనం అయిన షూస్‌.. ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం

11 May, 2022 21:11 IST|Sakshi

పారిస్‌: అరచేతిలో ఫోన్‌ ద్వారానే ఆర్డర్‌లు చేసుకునే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. బయటి మార్కెట్‌ల కన్నా.. ఆన్‌లైన్‌లోనే ఇప్పుడు అడ్డగోలు ప్రొడక్టులు దర్శనమిస్తున్నాయి. అదే టైంలో చిత్రవిచిత్రమైనవి కూడా కనిపిస్తున్నాయి. 

తాజాగా బాగా పేరున్న ఓ కంపెనీ వాళ్లు చేసిన పని.. సోషల్‌ మీడియాలో మామూలుగా ట్రోల్‌ కావడం లేదు. అందుకు కారణం.. పొట్టు పొట్టుగా చినిగిన షూస్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచడం. లగ్జరీ బ్రాండ్‌లకు కేరాఫ్‌ అయిన ‘బలెన్షియాగా’ తాజాగా పారిస్‌ స్నీకర్‌ కలెక్షన్‌ పేరుతో లాంచ్‌ చేసింది. ఈ షూస్‌ ఎలా ఉన్నాయంటే.. కనీసం వేసుకోవడానికి కూడా పనికి రానంతగా!

కానీ, వాళ్లు ఆ షూస్‌ను రిలీజ్‌ చేసింది వేసుకోవడానికేనట. పైగా అదే ఫ్యాషన్‌ అని ప్రకటించింది. వీటిలో రెండు స్టయిల్స్‌ను రిలీజ్‌ చేయగా.. మినిమమ్‌ ధర 495 డాలర్లు (మన కరెన్సీలో 38 వేల డాలర్లు) నుంచి గరిష్టంగా 1, 850 డాలర్లు (మన కరెన్సీలో లక్షా  44 వేల రూపాయల) దాకా ఉంది.  మట్టి కొట్టుకుపోయి.. సర్వనాశనం అయిన ఈ షూస్‌ను లిమిటెడ్‌ ఎడిషన్‌ అంటూ వంద జతలను మాత్రమే రిలీజ్‌ చేసిందట. వీటి అందానికి తోడు ‘‘స్నీకర్స్‌ అంటే జీవిత కాలం ధరించేవి’’ అంటూ ఓ క్యాప్షన్‌ సైతం ఉంచింది బలెన్షియాగా. ఇంత దరిద్రాన్ని చూశాక ట్రోల్‌ రాజాలు ఊరుకుంటారా?.. ఆ ప్యాషన్‌ను పేకాట ఆడేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు