ఆస్పత్రిలో చేరిన బెలారస్‌ అధ్యక్షుడు..పుతిన్‌తో సమావేశం తర్వాతే..

29 May, 2023 14:15 IST|Sakshi

బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషెంకో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ని కలిసిన తర్వాతే ఆస్పత్రిలో చేరినట్లు వార్త కథనాలు గుప్పుమన్నాయి. ఈ మేరకు అమెరికన్‌ వీక్లీ న్యూస్‌ మ్యాగజైన్‌ లుకాషెంకో మాస్కోలోని సెంట్రల్‌ క్లినికల్‌ ఆస్పత్రిలో చేరినట్లు ఆ బెలారస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి వాలెరీ సెప్కలో ఓ టెలీగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నట్లు తెలిపింది. అంతేగాదు లుకాషెండో పుతిన్‌తో సమావేశం అనంతరం అత్యవసరంగా మాస్కోలోని ఆస్పత్రిలో చేరారని, అక్కడే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు వాలేరీ.

ఐతే అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉందని, అందువల్ల అతనిని తీసుకువచ్చేలా వైద్య నిపుణలతో సహా అధికార బృందాన్ని పంపినట్లు తెలిపారు. అక్కడ లుకాషెంకోపై మాస్కో విషప్రయోగం జరిపినట్లు ఊహాగానాలు హల్‌చల్‌ చేస్తున్నట్లు కూడా వివరించారు వాలేరీ. అందువల్ల తాము అతనని సతర్వరమే రక్షించేలా అన్ని రకాల వ్యవస్థీకృత చర్యలు తీసుకుంటున్నట్లు వాలేరీ పేర్కోన్నట్లు అమెరికా వీక్లీ న్యూస్‌ తెలిపింది. నిజానికి మే 9ప మాస్కోలో రెడ్‌ స్క్వేర్‌లో జరిగిన విక్టరీ డే వేడుకలో లుకాషెంకో కనిపించిన కొన్ని వారాల తర్వాత ఆయన ఆరోగ్యంపై పుకార్లు రావడం మొదలైంది.

ఐతే లుకాషెంకో వాటిని తోసిపుచ్చారు. అంతేగాదు బెలారస్‌లో వ్యూహాత్మక క్షిఫణుల విస్తరణను లాంఛనప్రాయంగా చేయడానికి లుకాషెంకో ప్రభుత్వంతో రష్యా ఒప్పందం కుదుర్చకున్నట్లు రష్యా మీడియా పేర్కొంది. అందుకు సంబంధించిన పత్రాలపై ఇరు దేశాల నాయకులు సంతకం చేసినట్లు బెలారసియన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఆ రెండు దేశాలు తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే సమావేశంలో ఇరు దేశాల నాయకులు సైనిక, రాజకీయ పరిస్థితుల తోపాటు సాంకేతిక సహకార సమస్యలపై చర్చించనట్లు అని బెలారసియన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

(చదవండి: దిగుతున్న టైంలో విమానం డోర్ లాక్‌ అయ్యింది!.పాపం ఆ ప్రయాణికుడు..)

మరిన్ని వార్తలు