ఫిరంగి పరిమాణంలో గుడ్లు... డైనోసార్‌లలో మరోజాతి

17 Sep, 2022 13:25 IST|Sakshi

కాల్సైట్‌ స్పటికాల సముహాలతో నిండి... ఫిరింగి పరిమాణంలో ఉన్న డైనోసార్‌ గుడ్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి చైనాలో అన్హుయ్‌ ప్రావిన్స్‌లోని కియాన్‌షాన్‌లో గుర్తించారు. ఇవి రెండు దాదాపు సంపూర్ణ గుండ్రని గుడ్లని, క్రెటేషియస్‌ కాలం నాటివిగా పేర్కొన్నారు. అంతేగాదు ఇవి డైనోసార్‌ల యుగంలో చివరి కాలంనాటివిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

డైనోసార్‌లలోనే ఇవి ఒక కొత్త జాతిగా భావిస్తున్నారు. ఎందుకంటే గుడ్ల పరిమాణం, షెల్‌ యూనిట్‌, గట్టి అమరిక, ప్రత్యేకమైన గోళాకార ఆకృతి తదితరాలను బట్టి పాలియోంటాలజిస్టులు డైనోసార్‌లలో కొత్త జాతికి చెందినవిగా పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ గుడ్లలో ఒకటి సరిగా సంరక్షించబడలేదని చెప్పారు.

అందువల్లే వాటి అంతర్గత సముహాల్లో కాల్సైట్‌ స్పటికాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇవి దాదాపు గోళాకారంగా ఉండి, పొడవు 4.1 అంగుళాలు నుంచి 5.3 అంగుళాల మధ్య, వెడల్పు 3.8 అంగుళాల నుంచి 5.2 అంగుళాల మధ్య ఉంటుంది. ఈ డైనోసార్‌లు చిన్నచిన్న మొక్కలను ఆహారంగా తినే బైపెడల్‌ డైనోసార్‌లగా శాస్తవేత్తలు పేర్కొన్నారు. 

(చదవండి: భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు.. షాకింగ్‌ దృశ్యాలు వైరల్‌)

మరిన్ని వార్తలు